NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

  • ఎమ్మిగనూరు టిక్కెట్​ బుట్టా రేణుకకు ఖరారు
  • గెలిపించుకురావాలని ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డికి సూచించిన సీఎం జగన్​
  • వైసీపీ గెలుపు.. ఎమ్మిగనూరు నుంచే ప్రారంభం: బుట్టారేణుక

కర్నూలు, పల్లెవెలుగు:రాజకీయ చదరంగంలో వ్యూహాత్మకంగా ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి దిట్ట. గెలుపు గుర్రాల కోసం సర్వేల మీద సర్వేలు చేయిస్తున్న ఆయన…. ఇటీవల  నియోజకవర్గ కన్వీనర్లను ప్రకటిస్తూ నాలుగు జాబితాలను విడుదల చేశారు. కానీ ఐదో జాబితాలో అసెంబ్లీ కన్వీనర్లను మార్పు చేస్తూ… సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం స్థానంలో బీవై రామయ్యను,  ఎమ్మిగనూరు అసెంబ్లీ కన్వీనర్​ మాచాని వెంకటేశ్వర్లు బదులుగా బుట్టా రేణుకను ప్రకటించారు.  కర్నూలు రాజకీయంలో ఉత్కంఠకు తెరలేపిన ఎమ్మిగనూరు సీటు.. ఎట్టకేలకు బుట్టారేణుకకు ఖరారు చేశారు. ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డికి నచ్చజెబుతూ… బుట్టారేణకను గెలిపించుకురావాలని  సీఎం వైఎస్​ జగన్​ మోహన్​ రెడ్డి సూచించినట్లు తెలుస్తోంది.

వైసీపీ గెలుపు తథ్యం: బుట్టారేణుక

రాష్ట్రంలో వైసీపీ గెలుపు.. ఎమ్మిగనూరు నుంచే ప్రారంభమవుతుందని ధీమా వ్యక్తం చేశారు అభ్యర్థి బుట్టారేణుక. ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి సహకారం… సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి ఆశీర్వాదంతో తాను భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ…అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరవేయడంలో తాను ఎల్లప్పుడూ ముందుంటానని, ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని  ఈ సందర్భంగా ఎమ్మిగనూరు అసెంబ్లీ అభ్యర్థి బుట్టారేణుక వెల్లడించారు.

About Author