గెలుపుఖాయం.. మెజార్టీ కోసమే..
1 min readఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్, గడివేముల: దేశంలో ఏ ప్రభుత్వమూ అమలు చేయని సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోందని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య అన్నారు. ఆదివారం సాయంత్రం మండల కేంద్రంలోని గడివేముల పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. జెడ్పీటీసీ అభ్యర్థి ఆర్.బి. చంద్రశేఖర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య ప్రజలకు పిలుపునిచ్చారు. అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. పరిషత్ ఎన్నికల్లో వైసీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
..