గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలి
1 min readరాష్ట్రస్థాయి పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని నందికొట్కూరు శాసనసభ్యులు తోగూరు ఆర్థర్ అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రమైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం మూడు రోజులపాటు జరిగే రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ ఆటల పోటీలను ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.క్రీడల్లో పాల్గొనడానికి 13 జిల్లాల నుంచి వచ్చిన బాల బాలికలు మార్చ్ ఫాస్ట్ నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన అనంతరం గౌరవ వందనాన్ని స్వీకరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండే ఆటల పోటీల్లో ప్రతిభ కనబరుస్తూ ఉండాలని విద్యార్థులకు ఏఏ ఆటల పోటీల్లో శ్రద్ధ ఉంటుందో వాటిలో పాల్గొనేందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలని స్పోర్ట్స్ లో ఎంతో విలువ ఉందని మీరు ఆటల పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి తల్లిదండ్రులకు పాఠశాలలకు మంచి పేరు తీసుకురావాలన్నారు.ఆటల పోటీల్లో పాల్గొనడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని నేను ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటూ వాలీబాల్ కెప్టెన్ గా ఉండేవాడినని నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టమని నా తల్లిదండ్రులు నా ఉపాధ్యాయుల ప్రోత్సాహం వల్లే నేను ఈ స్థాయికి ఎదిగానని రాష్ట్రస్థాయిలో ఎన్ని మెడల్స్ ఉంటే అన్ని మెడల్స్ నేను తీసుకోవడం జరిగిందని ఎమ్మెల్యే విద్యార్థులతో అన్నారు.తర్వాత ఆటల పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించి విద్యార్థులను ఎమ్మెల్యే పరిచయం చేసుకున్నారు. కాసేపు విద్యార్థులతో ఆయన ఆటల పోటీల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు వంగాల సిద్ధారెడ్డి,రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ షేక్ అబ్దుల్ షుకూర్,కడుమూరు గోవర్ధన్ రెడ్డి,జిల్లా కార్యనిర్వాహక సభ్యులు ఇనాయతుల్ల,వెంకట్,జాన్,ఎంఈఓ శ్రీనాథ్, ప్రధానోపాధ్యాయులు సాయి తిమ్మయ్య,చెన్నకేశవ పాఠశాల కరస్పాండెంట్ కిరణ్,ఫిజికల్ డైరెక్టర్ శంకరయ్య,వివిధ పాఠశాలల పీడీలు మరియు అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు.