PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బైజూస్ పాఠాలతో ..బంగారు భవిష్యత్తు: డీఈఓ

1 min read

*ట్యాబ్ ల ద్వారా నాణ్యమైన విద్య

– డీఈవో రాఘవరెడ్డి

పల్లెవెలుగు వెబ్​, అన్నమయ్య జిల్లా  రాయచోటి:ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలలో చదివే విద్యార్థులందరికీ బైజుస్ పాఠాలతో బంగారు భవిష్యత్తు సమకూరనున్నదని అన్నమయ్య జిల్లా విద్యాశాఖాధికారి ఎద్దుల రాఘవ రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం మండల కేంద్రమైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన విద్య కోసం బైజూస్ పాఠాలతో కూడిన ట్యాబ్ లను 8వ తరగతి విద్యార్థులకు, వారికి బోధించే ఉపాధ్యాయులకు  పంపిణీ చేయడం జరుగుతున్నదని అన్నారు. ట్యాబ్ ల ద్వారా క్లాస్‌ బయట కూడా ఒక రోజులో ఉన్న 24 గంటలు పాటు విద్యార్ధులు సబ్జెక్ట్‌ను నేర్చుకోవడానికి వీలు  కలుగుతుందన్నారు. అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన మరొక ముఖ్యఅతిథి డిసిఎంఎస్ మాజీ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఇంతవరకు కేవలం స్ధితిమంతుల పిల్లలకే అందుబాటులో ఉన్న ఈ అవకాశాన్ని రాష్ట్రంలోని పేద పిల్లలకు ఒక మంచి మేనమామలా శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందిస్తున్న కానుక ట్యాబ్ ల పంపిణీ అని అన్నారు. విద్యార్థులు అందరూ బాగా చదువుకుని పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుని రావాలన్నారు. అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షులు చిదంబర్ రెడ్డి మాట్లాడుతూ  పేద విద్యార్ధులను గ్లోబల్‌ సిటిజెన్‌లుగా తీర్చిదిద్దేలా, డిజిటల్‌ విధానంలో పాఠ్యాంశాలు మరింత సులభంగా అర్ధమయ్యేలా…మెరుగైన చదువుల దిశగా ప్రభుత్వ ముందుకు సాగడం జరుగుతూ ఉంది అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్ లను  విద్యార్థులు అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ట్యాబ్ ల పంపిణీ సందర్భంగా బాగా మాట్లాడిన పదవ తరగతి విద్యార్థిని సాయి కీర్తనకు 1500 రూపాయలు నగదు బహుమతి అందజేశారు. అనంతరం జడ్పిటిసి గొర్ల కవిత మాట్లాడుతూ పేద విద్యార్థులకు సైతం డిజిటల్ విద్యను అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డిదే అని అన్నారు. తరగతి గదుల్లో చెప్పే పాఠాలను ఇళ్ళకు వెళ్ళాక కూడా పిల్లలు మరింత క్షుణ్ణంగా నేర్చుకునేందుకు వీలుగా బైజూస్ కంటెంట్తో కూడిన ట్యాబ్లు ఉచితంగా పంపిణీ చేయడం గొప్ప విషయం అన్నారు. ఇంటర్నెట్ సౌకర్యం లేని విద్యార్థులకు ఆఫ్ లైన్లో కూడా ఎక్కడైనా, ఎప్పుడైనా పాఠ్యాంశాలు అందుబాటులో ఉంటాయన్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు మడితాటి నరసింహారెడ్డి మాట్లాడుతూ బైజూస్ ప్రీమియం యాప్ ద్వారా విద్యార్థులకు మాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, జియాలజీ, సివిక్స్ సబ్జెక్ట్ లో అభ్యసన సులువుగా ఉంటుందన్నారు. ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ఉచిత ఈ- కంటెంట్ అందుబాటులో ఉంటుందన్నారు. పిల్లలకు సులభంగా పాఠ్యాంశాలు అర్ధమయ్యేలా టెక్స్ట్ రూపంలో మాత్రమే కాకుండా మంచి చిత్రాలు, వీడియో, ఆడియో, త్రీ డైమెన్షన్ (త్రీడీ) ఫార్ములాలో యానిమేషన్లతో రూపొందించిన పాఠాలు విద్యార్థులకు సులభంగా అర్థమవుతాయి అన్నారు. పిల్లలు తమ స్థాయిని స్వయంగా అంచనా వేసుకునేలా అసెస్మెంట్ విధానం, ప్రతి చాప్టర్ తర్వాత 40-50 ప్రశ్నలు, వివిధ గ్రేడ్లలో మాక్ పరీక్షలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం 8 వ తరగతి చదువుతున్న విద్యార్ధులు 2025 విద్యా సంవత్సరంలో సీబీఎస్‌ఈ విధానంలో ఇంగ్లీష్‌ మీడియంలో 10 వ తరగతి పరీక్ష రాసేందుకు ఈ ట్యాబ్ లు ఎంతో ఉపయోగపడతాయన్నారు. పిల్లలకు నష్టం జరిగే కంటెంట్ ను ఈ ట్యాబ్ ల నుంచి తొలగించాంరని పిల్లలకు మంచి జరగాలనే ఈ సెన్సార్ కట్ చేయడం జరిగిందన్నారు. పిల్లలు ఏం చూస్తున్నారనే టెన్షన్ తల్లిదండ్రులు, టీచర్లకు కూడా ఉండదన్నారు. అనంతరం స్థానిక వైసీపీ నాయకులు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ ఒక్కొక్క విద్యార్థిపై రూ. 16,500 కు పైగా మార్కెట్‌ విలువ గల ట్యాబ్, దాదాపు రూ. 15,500 విలువ గల కంటెంట్‌తో కలిపి ప్రతి 8 వ తరగతి విద్యార్ధికి రూ. 32 వేల  రూపాయలకు పైగా ఖర్చు ప్రభుత్వం చేస్తుందన్నారు. మూడు సంవత్సరాల పాటు  వారంటీ ఇస్తున్నారని, ఏదైనా సమస్య తలెత్తితే సమీపంలోని సచివాలయాల్లో ఇస్తే ఒక వారంలో వారు రిపేర్ చేసైనా ఇస్తారని లేదా మార్చి వేరేదైనా ఇస్తారన్నారు. ఈ ట్యాబ్‌లను విద్యార్థులు వినియోగించుకొని ఇంటర్‌కు వచ్చే సరికి కంప్యూటర్‌పై పూర్తి అవగాహన పెంచుకోవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి శ్యామల, సర్పంచ్ అంచల రామచంద్ర, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ బుజ్జి రెడ్డి, మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి, వైసిపి మండల కన్వీనర్ ఉదయ్ కుమార్ రెడ్డి, నాయకులు రమేష్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు,  తల్లిదండ్రులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

About Author