PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జాగ్రత్తలతో..గుండె పదిలం..!

1 min read

సకాలంలో చికిత్స చేస్తే.. ప్రమాదం తగ్గే అవకాశం

  • ప్రముఖ గుండె వైద్యనిపుణులు డా. వసంత కుమార్​
  • హార్ట్​ ఫౌండేషన్​ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటిన రిటైర్డు జడ్జి కె.సుధాకర్​

పల్లెవెలుగు, కర్నూలు:ఆహారపు అలవాట్లలో మార్పు.. వ్యాయామం లేకపోవడం.. తదితర కారణాల వల్ల వయస్సుతో సంబంధం లేకుండా  ఇటీవల కాలంలో చాలా మందికి గుండె పోటు వచ్చింది. గుండె పోటు లక్షణాలు ముందే గుర్తించి… సకాలంలో ప్రాథమిక చికిత్స చేస్తే ..ప్రమాదం నుంచి తప్పించే అవకాశం ఉంటుందన్నారు ప్రముఖ గుండె వైద్య నిపుణులు, ఏపీ సీఎస్​ఐ రాష్ట్ర అధ్యక్షుడు డా. వసంత కుమార్​.  నగరంలోని కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​లో ఆదివారం హార్ట్​ ఎటాక్​పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫౌండేషన్​ ప్రధాన కార్యదర్శి డా. చంద్రశేఖర్​ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి  గుండె వైద్యులు డా. వసంత కుమార్​ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా హార్ట్​ ఎటాక్​పై అవగాహన కల్పించారు.

రక్త ప్రసరణ తగ్గితే…

గుండెకు రక్త ప్రసరణ తగ్గినప్పుడు లేదా ఆగిపోయినప్పుడు గుండెపోటు వస్తుంది. కొరోనరీ ధమనులలో కొవ్వు, కొలెస్ట్రాల్ పరిమాణం పెరగడం ప్రారంభించినప్పుడు, ధమనుల ద్వారా రక్తం ప్రవహించకుండా నిరోధించినప్పుడు ఇది జరుగుతుంది. గుండెపోటు కూడా మరణానికి తీవ్రమైన కారణం కావచ్చు. మీకు ఏవైనా సాధారణ గుండెపోటు లక్షణాలు అనిపిస్తే.. వాటిని విస్మరించవద్దు. అయితే సైలంట్ హార్ట్ ఎటాక్ సంబంధించి కొన్ని ప్రమాదకరమైన సంకేతాలను అర్థం చేసుకోవాలని.. వాటిని గుర్తించడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చని తెలిపారు.

ఇవి కూడా.. లక్షణాలే..!

  అధిక ఒత్తిడి.. వ్యాయామం లేకపోవడంతో ఛాతిలో నొప్పి రావడం… చమటలు పట్టడం…త్వరగా అలిసిపోవడం..శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడట  వంటి సమస్యలు ఎదుర్కొంటారు.  ఇవన్నీ గుండె పోటు లక్షణాలుగా గుర్తించాలి. లక్షణాలను ముందే గుర్తించి… సకాలంలో సరైన వైద్య చికిత్సలు పొందడం వల్ల గుండె పోటును తగ్గించే అవకాశం ఉంది.

వ్యాయామం.. తప్పనిసరి..

ప్రతి రోజు వ్యాయామం.. యోగా.. చేస్తే మానసిక ఒత్తిళ్లకు గురికాకుండా ఉంటాము.దీంతో గుండె పోటుకు దూరంగా ఉండవచ్చు. శరీరానికి అవసరమైనంత పోషక ఆహారం తీసుకోవాలి. జంక్​ఫుడ్​, మద్యం.. సిగరేట్​ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.

డా. వసంత కుమార్​కు ఘన సన్మానం

విజయ దుర్గా హాస్పిటల్​ ఎండి, ప్రముఖ గుండె వైద్య నిపుణులు, ఏపీ సీఎస్​ఐ రాష్ట్ర అధ్యక్షుడు డా. వసంత కుమార్​ను హార్ట్​ ఫౌండేషన్​ తరుపున డా. చంద్రశేఖర్​, డా. భవాని ప్రసాద్​, రిటైర్డు జడ్జి కె. సుధాకర్​ ఘనంగా సన్మానించారు. పూలమాల వేసి..శాలువాతో సత్కరించారు.  వేలాది మంది గుండె వ్యాధి రోగులకు తక్కువ మొత్తంలో మెరుగైన వైద్య సేవలు అందించారని ఈ సందర్భంగా ఫౌండేషన్​ సభ్యులు కొనియాడారు.

మొక్కల ఆవశ్యకతతో…

అంతకు ముందు హార్ట్​ ఫౌండేషన్​ కార్యాలయ ఆవరణలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో  ప్రముఖులు 25 మొక్కలు నాటారు. తమ సంస్థ తరుపున ఎన్నో సేవా, మంచి కార్యక్రమాలు నిర్వహించామని, అందుకు స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం సంతోషించదగ్గ విషయమన్నారు డా. చంద్రశేఖర్​. కార్యక్రమంలో ఫౌండేషన్​ ట్రెజరర్​ రాముడు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

About Author