సమష్టి కృషితో.. నగరాభివృద్ధి సాధ్యం..
1 min readకో ఆప్షన్ సభ్యులకు డిక్లరేషన్ అందజేసిన మేయర్, కమిషనర్
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: నగరాభివృద్ధికి సమష్టిగా కృషి చేద్దామని కర్నూలు నగర మేయర్ బి.వై.రామయ్య పిలుపునిచ్చారు. గురువారం కర్నూలు నగర పాలక సంస్థ కార్యాలయంలోని మేయర్ ఛాంబర్ లో నూతనంగా ఎన్నికయిన స్టాండింగ్ కమిటీ సభ్యులు(కార్పొరేటర్లు) …49వ వార్డు కార్పొరేటర్ సోంపల్లి కృష్ణకాంత్, 33వ వార్డు కార్పొరేటర్ చిన్న నరసింహులు, 41వ వార్డు కార్పొరేటర్ గాజుల శ్వేతారెడ్డి, 9వ వార్డు కార్పొరేటర్ పుల్లమ్మ, 4వ వార్డు కార్పొరేటర్ అర్షియా ఫర్హీన్ లకు డిక్లరేషన్ పత్రాలను మేయర్ బి.వై.రామయ్య, నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజీ అందజేశారు. బరిలో ఉన్న ఐదు పోస్టులకు ఐదుగురు వైఎస్సార్ సిపి పార్టీ కార్పొరేటర్లు ఎన్నిక కావడం జరిగింది.