సమన్వయంతోనే.. అభివృద్ధి సాధ్యం..
1 min read
మాట్లాడుతున్న నగర మేయర్ బీవై రామయ్య
అధికారులు, ప్రజలు సహకరించాలి
– నగర మేయర్ బీవై రామయ్య
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: నగరంలో సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం కావాలంటే.. ప్రతిఒక్కరూ సమన్వయంతో పని చేయాలని నగర మేయర్ బీవై రామయ్య ప్రజలకు పిలుపునిచ్చారు. నగర అభివృద్ధికి అధికారులు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు సహకరించాలని సూచించారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ డీకే బాలాజి అధ్యక్షతన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర మేయర్ బీవై రామయ్య మాట్లాడుతూ… కర్నూలు నగరాన్ని.. రాష్ట్రానికే.. రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుదామన్నారు.