NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యతోనే ..బంగారు భవిష్యత్: జడ్జి దివ్య

1 min read

 పల్లెవెలుగు వెబ్​, పత్తికొండ: పట్టుదల దీక్ష క్రమశిక్షణతో విద్యను సముపార్జించి విద్యార్థులు తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని పత్తికొండ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి దివ్య విద్యార్థులకు సూచించారు. అంతర్జాతీయ బాలల దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం స్థానిక నంబర్ 2 హాస్టల్లో ఏర్పాటుచేసిన విజ్ఞాన సదస్సులో ఆమె విద్యార్థులకు  పలు సూచనలు చేశారు. విద్యార్థులు తమ కుటుంబ పరిస్థితులు అర్థం చేసుకొని సమాజం పట్ల బాధ్యతతో విద్యను అవలంబించాలన్నారు. విద్యపై మక్కువతో కష్టపడి క్రమశిక్షణతో విద్యాబుద్ధులు నేర్చుకోవాలన్నారు. విజ్ఞానంతో పాటు విలువలతో కూడిన విద్యను అలవర్చుకోవాలని విద్యార్థులకు ఉద్బోధించారు. విద్యాహక్కు చట్టం గురించి న్యాయవాదులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ కాశీ విశ్వనాథ్ న్యాయవాదులు మధుబాబు శ్రీనివాసరెడ్డి దామోదర చారి వాసుదేవ నాయుడు హాస్టల్ వార్డెన్లు రమేష్ వెంకటరాముడు కోర్టు సిబ్బంది రమాదేవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.ః

About Author