వ్యాయామంతో.. సంపూర్ణ ఆరోగ్యం..
1 min readటి.జి.వి సంస్థల చైర్మన్ టి.జి భరత్
– హార్ట్ ఫౌండేషన్‌కు రూ.15లక్షలు విలువ చేసే జిమ్ పరికరాలు అందజేత
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: వ్యాయామంతో… సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, ప్రతిఒక్కరూ వ్యాయమం, ధ్యానం చేయాలని టి.జి.వి సంస్థల చైర్మన్ టి.జి భరత్ అన్నారు. కర్నూలు ఏక్యాంపులోని హార్ట్ ఫౌండేషన్‌లో టి.జి.వి స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ సొసైటీ నుంచి ఉచితంగా అందజేసిన వ్యాయామ సామాగ్రిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూల్ హార్ట్ ఫౌండేషన్‌కు రూ. 15 లక్షలు విలువ చేసే వ్యాయామ సామాగ్రిని ఉచితంగా అందజేశానని, టి.జి.వి గ్రూప్స్ తరుపున కర్నూల్లో స్పోర్ట్స్‌కు ఎప్పుడూ అండగా ఉండి ప్రోత్సహిస్తామన్నారు. అనంతరం హార్ట్ ఫౌండేషన్ సెక్రటరి డా. చంద్రశేఖర్ మాట్లాడుతూ ఫౌండేషన్ స్థాపించినప్పటి టీజీవీ సంస్థ సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాలను కాపాడుకోవాలన్నారు. హార్ట్ ఫౌండేషన్‌లో జిమ్ పరికరాలు పెట్టడం వల్ల ఎంతో మందికి ఉపయోగపడుతుందన్నారు. ప్రతి రోజూ ఒక గంట సేపైనా వ్యాయామాలు చేస్తేనే ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చన్నారు. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలంటే స్పోర్ట్స్‌లో పాల్గొనడం, జిమ్‌లో వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకోవాలన్నారు. హార్ట్ ఫౌండేషన్‌కు రూ. 15లక్షలు విలువ చేసే జిమ్ పరికరాలు అందజేసిన టీజీ భరత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఫౌండేషన్ తరుపున టీజీ భరత్‌ను శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు.