NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మొదటి ప్రాధాన్యతతో.. ఆశీర్వదించండి

1 min read

– మండలిలో అందరి గొంతుకనవుతా
– పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కొత్తూరు లక్ష్మీనారాయణ
పల్లెవెలుగు వెబ్ అనంతపురం : పట్టబద్రులందరూ తమ యొక్క అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటుతో తనను ఆశీర్వదించి అఖండ మెజారిటీతో గెలిపించాలని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి కొత్తూరు లక్ష్మీనారాయణ కోరారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండల కేంద్రంలోని ఆయన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టబద్రులు వారి మొదటి ప్రాధాన్యత తనకు ఎన్నికల అధికారులు కేటాయించిన 14వ నెంబర్ ఎదురుగా ఒకటి అని రాసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాయలసీమ సమస్యలను శాసనమండలిలో చర్చిస్తానని పట్టభద్రులందరూ తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అదేవిధంగా తనకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి తన గెలుపునకు కృషి చేసిన బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహన్జి కుమారి మాయావతి గారికి, జాతీయ కోఆర్డినేటర్ ఆకాశ్ ఆనంద్ గారికి, దక్షిణ భారతదేశ కోఆర్డినేటర్ రాంజీ గౌతమ్ గారికి, రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారికి, ఉపాధ్యక్షులు గౌతమ్ గారికి, రాష్ట్ర కోఆర్డినేటర్ మల్లెకల్ గారికి, జిల్లా అధ్యక్షుడు గద్దల నాగభూషణం గారికి, జిల్లా ఇన్చార్జ్ తిరుమలయ్య గారికి, తనకు సహకరించి అండగా నిలిచిన బహుజన్ సమాజ్ పార్టీ అనంతపురం, కర్నూల్, కడప జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

About Author