‘ఎఫ్పీఓ’ తో.. చిన్న, సన్నకారు రైతులకు మేలు
1 min readకలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్
పల్లెవెలుగు, ఏలూరు: జిల్లాలో ఎఫ్ పిఓల ద్వారా చిన్న మరియు సన్నకారు రైతులకు ఎంతో మేలు జరుగుతుందని జిల్లాకలెక్టర్ వె. ప్రసన్నవెంకటేష్ అన్నారు. మంగళవారం స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో ఏలూరు జిల్లాలో ఎఫ్పీఓల ఏర్పాటు మరియు ప్రోత్సాహం కోసం నిర్వహించిన జిల్లా మానిటరింగ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా ఆయనమాట్లాడుతూ ఎఫ్ పిఓల ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడం, మార్కెట్లను నిర్ధారించడం మరియు వ్యయ ప్రభావవంతమైన పద్ధతిలో వ్యవసాయ ఇన్పుట్లను సరఫరా చేయడం వంటి వివిధ మార్గాల్లో రైతులకు ప్రయోజనం చేకూరుస్తాయన్నారు. వ్యవసాయ ఆధారితమైన ఏలూరు జిల్లాలో కూరగాయల సాగు, ఉద్యాన పంటల కింద మరిన్ని ఎఫ్పీఓలను ప్రోత్సహించాలని ఆయన సూచించారు. పశుసంవర్ధక , పాల ఉత్పత్తి, ఫిషరీష్ రంగాల్లో కూడా ఎఫ్ పిఓలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధాన మంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమ క్రమ బద్ధీకరణ పధకము (PMFME) క్రింద పరిశ్రమలు ఏర్పాటుకు నైపుణ్యతను పెంచుకోడడానికి మరియు మార్కెటింగ్ చేసుకునే ఆసక్తి ఉన్న రైతు ఉత్పత్తి దారుల సంఘాలకు 35% సబ్సిడీ 10 లక్షల వరకు రాయితీ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇందులో బాగంగా మామిడి, నిమ్మ, కోకో ఎండబెట్టుటకు అవసరమైన సోలార్ డ్రైయర్ కు సబ్సిడీ ద్వారా అందజేయడం జరుగుతుందన్నారు. తదుపరి సమావేశం నాటికి కూరగాయల రైతు ఉత్పత్తి దారుల సంఘం ఏర్పాటు చేసుకోవాలని ఉద్యాన శాఖఅధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఉద్యానవన శాఖ అధికారి ఎస్. రామ్మోహన్ మాట్లాడుతు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎఫ్ పీఓలకు సేకరణ కేంద్రాలు, కోల్డ్ స్టోరేజీ యూనిట్లు, గోడౌన్లు మొదలైన వాటికి 75% వరకు సబ్సిడీ పథకాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఉద్యానశాఖ ద్వారా రైతు ఉత్పత్తి సంఘం (FPO) లకు అందించే పధకాలను వివరించారు. పంట సేకరణ కేంద్రాలకు (60x40x15 అడుగులు) మొత్తం ఖర్చు 15 లక్షలు అవుతుంది. ఇందులో 75% చొప్పున అనగా 11.25 లక్షల క్రింద సబ్సిడీ మరియు శీతల గదులకు (10 మెట్రిక్ టన్నులు) మొత్తం ఖర్చు 12 లక్షలు 75% చొప్పున అనగా 9.37 లక్షల సబ్సిడీ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతోందని వివరించారు. డీడీఎం నాబార్డ్ అనిల్ కాంత్ మాట్లాడుతు భారత ప్రభుత్వం సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ద్వారా 10 వేల ఎఫ్ పిఓల ఏర్పాటుకు ప్రణాళిక చేశామన్నారు. ఇప్పటికే జిల్లాలో 18 ఏర్పాటయ్యాయన్నారు. అలాగే, జిల్లాలో నాబార్డ్ అద్వర్యంలో ఇప్పటికే 16 ఎఫ్పీఓ లు ఏర్పాటు చేసామని వాటి ద్వారా రైతులకి ఎంతో మేలు జరిగిందన్నారు. నాబార్డ్ అద్వర్యం లో నాబ్ కిసాన్ ద్వార జిల్లాలో ఎఫ్పీఓ ల కి రుణాలు ఇచ్చాము అని, అలానే నాబార్డ్ పథకాలు ద్వారా ఎన్నో ప్రయోజనాలు FPO లకి చేకూరాయని తెలియచేశారు. నాబార్డ్ అద్వర్యం లో నాబ్ సంరక్షన్ ద్వార ఎఫ్పీఓ ల కు తాకట్టు లేని రుణాలు అందించు అర్హత కలిగిన రుణ సంస్థలకు క్రెడిట్ గ్యారెంటీ కవర్ సౌకర్యం అందుబాటులో ఉందని తెలియచేశారు. సమావేశంలో ఎల్డిఎం నీలాద్రి , డిడిఎం – నాబార్డ్ అనిల్ కాంత్, ఉద్యానవన అధికారి , ఎస్ రామ్ మోహన్ పశుసంవర్ధక శాఖ అధికారి జి. నెహ్రూ బాబు , మత్స్య శాఖ, మార్కెటింగ్ శాఖ, సహకార శాఖ అధికారులు హాజరయ్యారు.