‘కోవిడ్’ నిబంధలతో.. ‘ఉరుకుంద ఈరన్న స్వామి’ ఉత్సవాలు
1 min readపల్లెవెలుగు కౌతాళం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఉరుకుంద ఈరన్న (శ్రీ నరసింహ) స్వామి దేవస్థానం 2021 శ్రావణమాసం ఉత్సవాలను భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని ఆలయ ఈఓ వాణి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. స్వామి దర్శనంకు వచ్చే భక్తులు మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించాలని సూచించారు.
స్వామి దర్శనానికివచ్చే భక్తులు సూచనలు…
1.65 సంవత్సరాలు పైబడిన వారు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, గర్భిణీలు, పది సంవత్సరముల లోపు పిల్లలను దర్శనానికి అనుమతించబడదు.
- ఆలయ ప్రవేశం చేయు ప్రతి వ్యక్తి తప్పనిసరిగా మాస్కులు ధరించవలెను.
- భక్తులు ఒకేచోట సమూహముగా ఉండకూడదు. భక్తులు ఎవ్వరూ కూడా L.L.C కాలువలో స్నానం చేయరాదు.
- దుకాణాలు క్యాంటీన్లు వంటివి.. దేవాలయ ఆవరణ బయట ఏర్పాటు చేయవలెను. దుకాణాల వద్ద కూడా భక్తులు దూరం పాటించవలెను.
- భక్తులకు తీర్థ ప్రసాదములు వితరణ, శటారి, పవిత్ర జలం చల్లుట వంటివి ప్రస్తుతం నిలుపుదల చేయడమైనది.
- గర్భాలయ దర్శనాలు నిలిపి వేయడమైనది.
- గదులు అద్దెకు ఇవ్వబడదు.
- దేవస్థాన పరిసర ప్రాంతాలలో రాత్రి సమయంలో నిద్ర చేయడానికి వీలులేదు.
- దేవాలయ ప్రవేశం నుండి దర్శనం, ప్రసాదం కౌంటర్, అన్నదానం క్యూ-లైన్ లో భౌతిక దూరం కనీసం 6 అడుగులు పాటించవలెను.
- దేవాలయ ప్రాంగణంలో భక్తులు కూర్చునే ప్రదేశములలో కూడా భౌతిక దూరం పాటించవలెను.
- దేవస్థానంలో భక్తులు పెద్ద సంఖ్యలో ఉండకూడదు.
- కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున సామూహిక ప్రార్ధనలు / భోజనాలుచేయరాదు అని ఈఓ ఒక ప్రకటనలో తెలిపారు.