NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నైట్రిక్​ యాసిడ్​తో.. కరోనాకు చెక్​

1 min read

హోమియోపతి వైద్యుడు కేవీ సుబ్రహ్మణ్య రెడ్డి
పల్లెవెలుగు వెబ్​, విజయవాడ: కరోనా వైరస్​ను హోమియాపతి నైట్రిక్ యాసిడ్ 200 తో తగ్గించవచ్చని ప్రముఖ హోమియాపతి వైద్య నిపుణులు కేవి సుబ్రహ్మణ్య రెడ్డి తెలిపారు. శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం మన శరీరంలో హీలింగ్(స్వస్థత) వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవటం వలన కోవిడ్ భాగా విజృంభిస్తుందన్నారు. కోవిడ్ వలన విపరీతమైన దగ్గు, జలుబు, జ్వరం, ఊపిరితిత్తుల్లో రక్తనాళాలలో మార్పులు, ముక్కు నాసికా రంధ్రాల్లో రక్తం గడ్డ కట్టడం, ఆక్సిజన్, పల్స్ పడిపోవటం వంటి చర్యలు జరుగుతున్నాయని, దీనివలన మరణం సంభవిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో గత ఆరు నెలలుగా కోవిడ్ పై పరీక్షలు జరుపుతున్నామని, అందులో భాగంగా కొన్ని వందల మందికి పరీక్షలు చేసి ఫలితాలు రాబట్టామన్నారు. కోవిడ్ కు అద్భుతమైన మందు నైట్రస్ యాసిడ్ 200 అని, ఇది దాదాపు కోవిడ్ ను చాలావరకు వరకు నయంచేయవచ్చని తెలిపారు. ఈ నైట్రస్ యాసిడ్ ను వ్యాధి నిర్దారణ పట్టి వాడాలని మూడు పూటలా వాడితే మంచి సత్పలితాలిస్తుందని తెలిపారు. ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనిదని, ఎవరైనా వాడవచ్చని, కోవిడ్ అన్ని దశలలో ఉన్న వాళ్ళు కూడా వాడవచ్చని తెలిపారు.

About Author