PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘నృత్యాంజలి’తో… భారతీయ సంస్కృతిని స్మరించుకుందాం..

1 min read

మలబార్​ గోల్డ్​ అండ్​ డైమండ్స్​ సంస్థ చైర్మన్ ఎం.పి. అహమ్మద్​

 పల్లెవెలుగు వెబ్​: భారతీయ సాంప్రదాయ నృత్యరూపాలను స్వచ్ఛమైన బంగారంపై చెక్కి ‘నృత్యాంజలి’ పేరుతో అద్భుతమైన ఆభరణాలను విడుదల చేసింది మలబార్​ గోల్డ్​ అండ్​ డైమండ్స్​ సంస్థ.  దేశ వాణిజ్యరంగంలో అతిపెద్ద బంగారు మరియు వజ్రాభరణాల వ్యాపార సంస్థల్లో ఒకటైన మలబార్​ గోల్డ్​ అండ్ ​డైమండ్స్​ సంస్థ… భారతీయ నృత్య రూపాలను సగౌరవంగా స్మరించుకుంటూ ఆదివారం కర్నూలు షోరూములో  ‘నృత్యాంజలి’ పేరుతో విడుదల చేసింది. హస్తకళా ప్రావీణ్యంతో చెక్కబడిన ప్రతి ఆభరణం 100శాతం  బీఐఎస్​ హాల్​మార్క్​  చేయబడి స్వచ్ఛమైన బంగారంతో తయారు చేయబడింది. ఉన్నతమైన సొగసు కోసం విలువైన రత్నాలు పొదగబడ్డాయి. శాస్ర్తీయ నృత్య రూపాల ఒంపులతో, రత్నాలతో ఆభరణాల ప్రపపంచంలో కొత్త కోణాలను  ఆవిష్కరిస్తాయి. అనేక రకాల  డిజైన్లతో కూడిన  ఈ సేకరణలో నెక్లెస్​, చెవిపోగు, ఉంగరాలు మరియు గాజులు  తదితర ఆభరణాలు  ‘నృత్యాంజలి’ ఇతి వృత్తాన్ని ప్రతిబింబిస్తాయని ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో  ఆ సంస్థ చైర్మన్​ ఎం.పి. అహమ్మద్​ పేర్కొన్నారు.  ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని మలబార్​గోల్డ్​ అండ్​ డైమండ్స్​ షోరూముల్లో  ‘నృత్యాంజలి’ పేరుతో ఆభరణాలు అందుబాటులో ఉన్నాయన్నారు. కర్నూలు షోరూములో జరిగిన ‘ నృత్యాంజలి’ కార్యక్రమంలో స్టోర్​ అసిస్టెంట్​ హెడ్​ చేతన్​, మార్కెటింగ్​  మేనేజర్​ నూర్​వుల్లా, స్టోర్​ మేనేజర్​ అజీష్​ కుమార్​, మన్సూర్​; సుధాకర్​ తదితరులు పాల్గొన్నారు.

About Author