పోషకాహారంతో… ఆరోగ్యం పదిలం.. : మౌనిక
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు : పిల్లలకు, గర్భీణులకు ఆరోగ్యకరమైన ఆహారం అందివ్వాలని సూచించారు రైతు భరోసా కేంద్రం( ఆర్బీకే) సభ్యులు చంద్రలేఖ . MCA. వీరన్న, NF. చంద్రరేఖ, Newicrps. సలీమా, చిన్నమ్మ, రజినమ్మ, రాధమ్మ, మంగళవారం కర్నూలు జిల్లా కల్లూరు మండలం A. గోకులపాడు గ్రామంలోని అంగన్వాడీ సెంటర్ 2లో సూర్య మండలం 18 రకాల సీడ్స్( విత్తనం) నాటారు. గడ్డ జాతి, ముల్లంగి క్యారెట్ ఎర్రగడ్డ, తీగ జాతి, బీరకాయ సొరకాయ , చిక్కుడు కాకర , ఆకుకూరలు, . తోటకూర, మెంతి కూర, పాలకూర, గోంగూర, కోతిమీర, వంకాయ, టమేటా, మిర్చి, చౌళేకాయలు, బెండకయా, మునగ, కర్వేపాకు సంబంధించి విత్తనాలు నాటారు. ప్రకృతి వ్యవసాయ సేద్యంలో భాగంగా విత్తనాలు నాటి, వాటి యొక్క ఉపయోగాల గురించి ఈ సందర్భంగా ఆర్బీకేలు వివరించారు. ఇక్కడ పండించే పంటలు మధ్యాహ్నభోజనంలో పిల్లలకు వడ్డిస్తామన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ సెంటర్ టీచర్ అరుణ జ్యోతి, ఆయా నాగ లత, చిన్నారులు తదితరులు ఉన్నారు.