PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోషకాహారంతోనే… ఆరోగ్యం పదిలం..: డా.చంద్రిక

1 min read

–డైటిషియన్​, న్యూట్రిషియనిస్ట్​  డా. శ్రీమతి జె. చంద్రిక

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: విటమిన్లు, ప్రొటిన్లతో కూడిన ఆహారాన్ని సమపాలలో తీసుకుంటే.. ఆరోగ్యం పదిలంగా ఉంటుందన్నారు డైటిషియన్​, న్యూట్రిషియనిస్ట్​ డా. శ్రీమతి జె. చంద్రిక.  ఆరోగ్యానికి హానికరమని తెలిసినా.. కొందరు యువత ఫాస్ట్​ఫుడ్​ తినడం ఆందోళన కలిగించే అంశమన్నారు.  నగరంలోని కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​ భవనంలో ఆదివారం ‘ జీవితంలో ఆహారం పాత్ర’ అనే అంశంపై అవగాహన సదస్సు జరిగింది.  పౌండేషన్​ సెక్రటరి, ప్రముఖ కార్డియాలజిస్ట్​ డా. పి. చంద్రశేఖర్​ ఎండి,డీఎం., ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో మెరుగైన ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన ఆహారంపై చర్చించారు.  ఈ సందర్భంగా డైటిషియన్​, న్యూట్రిషియనిస్ట్​ డా. జె. చంద్రిక మాట్లాడుతూ మనిషి జీవన శైలిలో ఆహార నియమాలు పాటించకపోవడంతో అనారోగ్యంపాలై అవస్థలు పడుతున్నారన్నారు. పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని, అందులోనూ సమతుల్యత పాటించాలన్నారు. జీర్ణక్రియకు ఇబ్బందిపెట్టే ఆహారం తీసుకోకూడదన్నారు.  అనంతరం డైటిషియన్​, న్యూట్రిషియనిస్ట్​ డా. జె. చంద్రికను కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​ సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో మెడికల్​ విద్యార్థులు, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author