PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘ప్లే జోన్​’తో… ఆరోగ్యం సురక్షితం..

1 min read

–క్రీడా మైదానాన్ని  ప్రారంభించిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. పి.చంద్ర శేఖర్ మాతృ ముర్తీ శ్రీమతి సావిత్రమ్మ

కర్నూలు: ఆధునిక సమాజంలో సెల్​ఫోన్లు, కంప్యూటర్​కే పరిమితమైన యువత… మానసిక ఒత్తిళ్లకు గురవుతూ అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్నాని, వ్యాయామంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నారు కర్నూలు హార్ట్ ఫౌండేషన్ కార్యదర్శి , ప్రముఖ కార్డియాలజిస్ట్​ డా. పి.చంద్రశేఖర్​. బుధవారం కర్నూలు–నంద్యాల హైవేకు సమీపంలోని  దిన్నెదేవరపాడు రహదారిలో నూతనంగా ఏర్పాటుచేసిన ప్లే జోన్ క్రీడా మైదానాన్ని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి చంద్రశేఖర్ మాతృమూర్తి శ్రీమతి సావిత్రమ్మ ప్రారంభించారు. ఈ  సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న యాంత్రిక జీవనంలో నిరంతరం  ఒత్తిళ్లకు గురవుతూ అనేక వ్యాధులకు గురవుతున్నారని చెప్పారు .ప్రతి ఒక్కరూ శారీరక మానసిక ఒత్తిళ్లు అధిగమించేందుకు వీలుగా క్రీడలు సాధన చేయడం అవసరమని వివరించారు. ప్రతి ఒక్కరి జీవన విధానంలో క్రీడలు భాగస్వామ్యం కావాలని, తద్వారా శరీరానికి వ్యాయామం లభించి మానసిక శారీరక సమస్యలను అధిగమించవచ్చని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ సెల్ఫోన్లకు తీవ్రంగా అలవాటు పడి అనేక రకాల ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారని వివరించారు. నగరంలో ఏర్పాటు చేసిన ప్లే జోన్ క్రీడా మైదానాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం  ప్లే జోన్ క్రీడా మైదానం నిర్వాహకులు వెంకట్రావ్  మాట్లాడుతూ దాదాపు అర ఎకరం స్థలంలో ఈ క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేశామని వివరించారు. ఇందులో క్రికెట్ వాలీబాల్ లాంటి క్రీడలను సాధన చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు .ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  కార్యక్రమంలో ప్లే జోన్ నిర్వాహకులు వెంకట్రావు,గౌతమ్, అఖిల్ తో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

About Author