సాధనతో.. సమయస్ఫూర్తిని పెంపొందించుకోవాలి
1 min readటీ.జీ .వెంకటేష్
పల్లెవెలుగు:కరాటే క్రీడాకారులు శరీరాకృతిని పెంపొందించుకోవడమే కాక సమయస్ఫూర్తితో వ్యవహరించి రాణించాలని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ వాక్యానించారు. ఆదివారం స్థానిక నగరంలోని కిడ్స్ వరల్డ్ లో ఏర్పాటుచేసిన జిల్లాస్థాయి కరాటే పోటీలు, ఎంపిక కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. చిన్నారులు క్రమం తప్పకుండా సాధన చేసి, శరీర ఆరోగ్యంతో పాటు శరీర ఆకృతిని కలిగి ఆత్మరక్షణతో పాటు సమయస్ఫూర్తితో రాణించాలని ఆయన కోరారు. చిన్నారులు సాధన చేసి చురుకుదనాన్ని పెంపొందించుకొని సమాజాభివృద్ధికి తోడ్పడాలని ఆయన కోరారు. అనంతరం కరాటే విజేతలకు మెడల్స్ సర్టిఫికెట్లు బహిష్కరించి అభినందించారు. సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బి. రామాంజనేయులు, ఆంధ్రప్రదేశ్ రగ్బీ అసోసియేషన్ కోశాధికారి గుడిపల్లి సురేందర్, రాష్ట్ర కరాటే అసోసియేషన్ అధ్యక్షులు కోల ప్రతాప్, శాఖ కార్యదర్శి షకిల్, క్రీడా సంఘ ప్రతినిధులు వేణుగోపాల్, సిహెచ్ చిట్టిబాబు, పరుశరాముడు, టీ. గంగాధర్, కొండపోగు చిన్న సుంకన్న, నాగ శ్రీనివాసులు తో పాటు తదితర క్రీడాకారులు పాల్గొన్నారు.