ప్రియుడితో కలిసి.. భర్తను దారుణంగా హత్య చేసిన భార్య…
1 min read– హంద్రీనీవాలో పడేసిన వైనం..
– పోలీసుల గాలింపులో… దొరికిన అస్తి పంజరం..
పల్లెవెలుగువెబ్, ఓర్వకల్లు: ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది ఓ భార్య.. ఈ ఘటన ఓర్వకల్లు మండలం, ఉయ్యలవాడలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన చెట్లమల్లాపురం రామయ్య అనే వ్యక్తిని అతని భార్య జయలక్ష్మి, ఆమె ప్రియుడు ముల్లా మహమ్మద్ ఖైజర్ @ ఖిజర్ కలిసి పతకం ప్రకారం 13.09.2021 వ తేదీ రాత్రి టవల్ తో గొంతు బిగించి హత్య చేశారు. శవాన్ని మాయం చేయాలనే ఉద్దేశ్యంతో ముల్లా మహమ్మద్ ఖైజర్ @ ఖిజర్ తడకనపల్లె –చిన్నటేకూరు గ్రామాల మధ్య వేగంగా పారుతున్న హంద్రీ-నీవా కాలువలో పడేశారు. మృతుడి భార్య, కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. విచారణలో భాగంగా మృతుడి భార్య జయలక్ష్మి, ఆమె ప్రియుడు ముల్లా మహమ్మద్ ఖైజర్ చెట్ల మల్లాపురం రామయ్యను హత్య చేసినట్లు అక్టోబరు 16న ఒప్పుకున్నారు. ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి ఆదేశాలతో.. కర్నూలు టౌన్ DSP K.V. మహేశ్ పర్యవేక్షణలో కర్నూలు రూరల్ సి.ఐ. M.శ్రీనాధ రెడ్డి ఆధ్వర్యములో ఓర్వకల్లు, ఉలిందకొండ, K.నాగలపురం పోలీసు స్టేషన్ల SI లు N.C. మల్లికార్జున, G.K.శరత్ కుమార్ రెడ్డి, M.ప్రేమ మరియు సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ లు ప్రతాప్ కుమార్, కలామ్, సుబ్బరాయుడు, వెంకటేశ్వర్లు, PCs సుశీల్, బలరామ్, రవీంద్ర సింగ్ లతో కలిసి వెతికారు. సోమవారం (18.10.2021) ఉదయం మృతుడు రామయ్య యొక్క శవము హంద్రి నీవా కాలువ మల్లెపల్లె ఎత్తిపోతల పధకం వద్ద నీటిలో తేలుతూ కనబడినది. సదరు శవమును బయటకు తీయగా మృతుడి శరీరము సుమారు నెల రోజులుగా హంద్రీనీవా కాలువ నీటిలో ఉండి, పూర్తిగా తల లేకుండా చొక్కా లోపల కుళ్ళిపోయిన స్థితిలో అస్తి పంజరముగా ఉన్నది, నడుము నుండి మోకాళ్ళ వరకు బాగము నిక్కర్ లోపల మాత్రం కుళ్ళిపోయిన శరీర బాగము కలదు. పోతి చొక్కా, నిక్కరు, మెడలో ఉన్న ఎరుపురంగు తాడు దానికి ఉన్న తాయత్తు మరియు నిక్కరు కు వున్న జిప్ పాకెట్ లోపల దొరికిన వస్తువులు తడిచిపోయిన మృతుడి ఫ్యామిలి ఫోటో, ప్లాస్టిక్ కవర్లో ఉండిన మృతుడి యొక్క పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, మృతుడి యొక్క జిరాక్స్ ఆదార్ కార్డు, తడిచిపోయిన ఫోన్ నెంబర్లు వ్రాయబడిన పాకెట్ పుస్తకము లను చూసి మృతుడి రక్తబందువులు, సదరు శరీర బాగములు మృతుడు చెట్లమల్లాపురం రామయ్య గా గుర్తించారు. సదరు శవము లభించిన ప్రదేశమును కర్నూలు టౌన్ D.S.P. K.V. మహేశ్ పరిశీలించారు. మృతుడి తల్లిదండ్రులు లక్ష్మీదేవి, తిరుపాలు, అక్క సువర్ణ, పిల్లలు చందన @ చందు, ఎల్ల శేఖర్ @ శేఖర్ లను విచారించి తన సిబ్బందికి సూచనలు ఇచ్చారు. కోడుమూరు సర్కిల్ సి.ఐ. శ్రీధర్, కోడుమూరు PS SI వేణుగోపాల్ లు సదరు ప్రదేశమును చేరుకొని విచారణలో సహకరించినారు. కర్నూలు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ M.శ్రీనాథ రెడ్డి శవపంచనామా నిర్వహించి, శవపరీక్ష నిమిత్తము కర్నూలు మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ వద్దకు పంపడం జరిగినది. శవపరీక్షను Dr. V.రాజ శేఖర్, M.D. Associate Professor నిర్వహించారు.