మళ్లీ రజినీతో ..
1 min readసినిమా డెస్క్ : ‘ప్రాజెక్టు కె’ వర్కింగ్ టైటిల్ తో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సినిమాలో ప్రభాస్‌కు జోడీగా నటిస్తోంది దీపికా పదుకునే. ఇప్పుడు లేటెస్ట్గా తన గురించో న్యూ చక్కర్లు కొడుతోంది. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌తో మళ్లీ నటించనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదో పక్కా యాక్షన్ మూవీ అని, ఇందులో దీపికకు కూడా యాక్షన్స్ సీన్స్ ఉంటాయంటున్నారు. ఆల్రెడీ ‘ఎక్స్ఎక్స్ఎక్స్ : రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్’ హాలీవుడ్ చిత్రంలో కొన్ని స్టంట్స్ చేసిన దీపికా ఇప్పుడు షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ లో యాక్షన్ సీన్స్ చేస్తోందట. దీనికోసం తను స్పెషల్ ట్రైనర్ తో శిక్షణ తీసుకుంటూ ప్రిపేర్ అవుతుందని తెలిసింది.
సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. అయితే ఇప్పుడు మరోసారి సూపర్ స్టార్ రజినీకాంత్‌తో కలిసి నటించనుందనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. గతంలో ‘కొచ్చాడయాన్’ మూవీలో రజినీతో నటించినా అది ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ‘అన్నాత్తే’ తర్వాత దేశింగ్ పెరియస్వామి దర్శకత్వంలో నటించనున్న రజినీ, ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికను సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారట. ఇప్పటికే దీపికను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఇకపోతే దీపిక నటించిన ‘83’, ‘సర్కస్’ మూవీలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం శకున్ బాత్రా మూవీ షూటింగ్లో పాల్గొంటున్న దీపిక‘ది ఇంటర్న్ రీమేక్’, ‘మహా భారతం’ , హృతిక్‌తో ‘ఫైటర్’ చిత్రాల్లో నటించనుంది.