బోర్ల మరమ్మతుతో.. నీటి సరఫరా మెరుగు
1 min readపల్లెవెలుగువెబ్, గోనెగండ్ల: మండలకేంద్రమైన గోనెగండ్లలో త్రాగునీరు నాలుగు రోజులకు ఒకసారి వస్తున్నాయి. త్రాగునీటి అవసరం కొరకు2019 వేసవిలో ఎంఏల్ఏ చెన్నకేశవ రెడ్డి ఆదేశాలతో రెండు బోర్లు వేయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆబోర్లు నీటిలో మునిగిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఆబోర్లు తేలిఉన్నందువల్ల గ్రామసర్పంచ్ హైమావతి ఆ నీటిని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో కలిపితే గోనెగండ్ల గ్రామానికి రోజుమరచి రోజు నీళ్ళు వదలవచ్చని అందుకు చెరువు బోర్ల నుండి డంప్ యార్డు వరకు విద్యుత్ సప్లయ్ మరియు స్తంభాలు, విద్యుత్ సరఫరా చేయాలని కోరారు. అందులో భాగంగా సోమవారం సాయంత్రం గోనెగండ్ల ఎం పి డి ఓ ప్రవీణ్ కుమార్, విద్యుత్ ఏఈ శ్రీనివాస్ రెడ్డి , సర్పంచ్ హైమావతి పరిశీలించి ఎస్టిమేషన్ వేస్తామని తెలిపారు. ఇందుకు దాదాపుగా 4.20 లక్షల రూపాయలు కావచ్చు అనితెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్వకేటే చంద్రశేఖర్, పోలకల్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.