కుంకుమ పువ్వుతో .. బోలెడు ప్రయోజనాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : కుంకుమ పువ్వుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీని వల్లనే కుంకుమ పువ్వు ధర అధికంగా ఉంటోంది. వీటి సేకరణలో కూడ చాలా శ్రమ కూడి ఉంటుంది. ఇది కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే లభిస్తుంది. ఫలితంగా అధిక ధర ఉంటుంది. చర్మం, జుట్టుకు మాత్రమే కాకుండా మొత్తం శరీర ఆరోగ్యానికి కూడా మేలు చేసే ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. గుండె సంబంధిత సమస్యలు తలెత్తకుండా అడ్డుకోవడంలో, మెరుగైన కంటిచూపుకు, జ్ఞాపకశక్తి పెంపుకు, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కీలకంగా పనిచేస్తుంది. అందుకే అనేక మంది తమ రోజువారీ ఆహారంలో కుంకుమ పువ్వును చేర్చుతారు. కుంకుమ పువ్వులోని పోషకాలు గ్యాస్ట్రిక్ ట్రబుల్‌కు తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచి, ప్రేగుల్లో గ్యాస్ చేరకుండా నిరోధిస్తుంది. కుంకుమపువ్వు లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు పెద్దప్రేగు క్యాన్సర్ కణాల పెరుగుదలను అణిచివేసి చంపుతాయి. దీనిలో యాంటీ క్యాన్సర్ కారకాలు చర్మం, ఎముక మజ్జ, ఊపిరితిత్తులు, రొమ్ము, గర్భాశయం, ప్రోస్టేట్ వంటి ఇతక క్యాన్సర్‌ల కణాలను కూడా ప్రభావితం చేస్తాయి.