PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్రీడలతో..మానసికోల్లాసం..

1 min read

ఆరోగ్యం.. పదిలం

  • సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ

కర్నూలు,పల్లెవెలుగు:మత్తు…మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా ఉండాలంటే…. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని సూచించారు సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ.  నగరంలోని నంద్యాల చెక్​ పోస్ట్ వద్ద ఉన్న శిరిడి సాయి నగర్ లో ఉన్న మున్సిపల్ స్టేడియంలో మార్షల్ ఆర్ట్స్ శిక్షకుడు రాఘవేంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కరాటే బెల్ట్ గ్రేడింగ్ పోటీలను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు .ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బెల్టులను ప్రధానం చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ మాట్లాడుతూ గంజాయి లాంటి మత్తు మాదకద్రవ్యాల వినియోగం సర్వసాధారణంగా మారిన ఈ రోజుల్లో పిల్లలు వాటికి బానిసలుగా మారకుండా ఉండాలంటే తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని చెప్పారు. ముఖ్యంగా కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందడం వల్ల  దేహదారుడ్యాం ,  క్రమశిక్షణ, అంకిత భావం పెంపొందుతుందని  చెప్పారు. క్రీడల్లో పాల్గొన్న శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులోనూ రాణిస్తారని చెప్పారు.  దేశానికి నిజమైన సంపద భావిభారత పౌరులైన చిన్నారులేరని వారు క్రమశిక్షణ గల పౌరులుగా ఎదగాలంటే క్రీడలను మించిన సాధనం మరొకటి లేదని చెప్పారు. కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందడం వల్ల చిన్నారుల్లో యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటి ఆరోగ్యానికి ఉపయోగపడే అంశాలు ఎన్నో ఉన్నాయని ఆయన తెలిపారు. కరాటే సాధన చేసే చిన్నారులు సుదీర్ఘమైన శ్వాస తీసుకోవడం ద్వారా మానసిక ఆరోగ్యం మరింత మెరుగుపడుతుందని చెప్పారు. ముఖ్యంగా ఈ వేసవి నేపథ్యంలో ఎండలు ఎక్కువగా ఉన్న తరుణంలో ఎక్కువగా నీటిని తాగాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. లేదంటే డీహైడ్రేషన్ వల్ల వడదెబ్బకు గురి అయ్యే ప్రమాదం తోపాటు మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉందని చెప్పారు. ఎండాకాలంలో ఎక్కువగా స్వచ్ఛమైన మంచినీటిని తీసుకోవాల్సిన అవసరం ఉందని, కలుషితమైన నీటిని తాగడం వల్ల కలరా, మలేరియా, టైఫాయిడ్, పసిరికలు , జీర్ణకోశ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆయన వివరించారుమ కర్నూలు నగరంలో క్రీడలను ప్రోత్సహించేందుకు తన వంతు సహకారం నిరంతరం ఉంటుందని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు.

About Author