టీడీపీతోనే… అభివృద్ధి: టీజీ భరత్
1 min read
పల్లెవెలుగు వెబ్: కర్నూలులో అభివృద్ధి పనులు జరగాలంటే తనను ఎమ్మెల్యే గా ఎన్నుకోవాలని కర్నూల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జీ టిజి భరత్ అన్నారు. బుధవారం నగరంలోని 50వ వార్డులో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కార్యక్రమంలో టిజి భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా మంది ప్రజాప్రతినిధులు మాటలతో మభ్య పెడుతున్నారన్నారు. అయితే తాను మాత్రం సమస్యలుంటే వెంటనే స్పందించి పరిష్కరిస్తానని చెప్పారు. అధికారం ఇస్తే మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుందని భరత్ అన్నారు. కేవలం ఎన్నికల సమయంలో చెప్పే కల్లబొల్లి మాటలు నమ్మవద్దని.. ఊరు బాగుండాలంటే తనని ఎమ్మెల్యే గా గెలిపించుకోవలని ప్రజలను కోరారు. అవకాశం ఇస్తే కర్నూలు ప్రజలకి సేవ చేసుకుంటానని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా టిజి భరత్ ను గద, కిరీటంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇంఛార్జీ మణి శంకర్ నాయుడు, నేతలు దాసెట్టి శ్రీనివాసులు, పాల్ రాజు, రమణ, తదితరులు పాల్గొన్నారు.
