PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీడీపీతోనే.. కళాకారులకు గుర్తింపు, గౌరవం: సోమిశెట్టి వెంకటేశ్వర్లు

1 min read

పల్లెవెలుగు వెబ్​: తెలుగుదేశం పార్టీతోనే కళాకారులకు గుర్తింపు, గౌరవం లభిస్తుందని ఆ పార్టీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు చెప్పారు. ఎన్నికల వరకు వాడుకుని తర్వాత వదిలేసే పరిస్థితులను ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా జిల్లా టీడీపీ ఆఫీసులో రంగస్థల మహిళా కళాకారులకు సన్మానం, చీరల పంపిణీ జరిగింది. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా  సోమిశెట్టి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కళాకారులకు టీడీపీ అండగా నిలుస్తుందని అభయం ఇచ్చారు.

టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం: హనుమంతరావు చౌదరి

తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే కళాకారుల లక్ష్యమని కర్నూలు పార్లమెంటు సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు హనుమంతరావు చౌదరి అన్నారు. పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్ స్వయానా కళాకారుడు అయినందు వల్ల ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లేందుకు కళాకారులందరూ కట్టుబడి ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలపై విపరీతంగా మోపుతున్న భారాల గురించి ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీసేలా చైతన్యం చేద్దామని పిలుపునిచ్చారు.  ఎన్టీఆర్ వల్లే కళాకారులు పార్టీ స్థాపించిన నాటి నుంచి ఇప్పటికీ కొనసాగుతున్నారని, రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా అన్నింట్లోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడం.. చంద్రబాబు మళ్లీ సీఎంగా చూడడమే లక్ష్యంగా కళాకారులు పనిచేస్తారని హనుమంతరావు చౌదరి తెలిపారు. కర్నూలు పార్లమెంటు సాంస్కృతిక విభాగం సమావేశంలో కార్యదర్శి కౌలుట్లయ్య, కమిటీ సభ్యులు చెన్నల రాముడు, చాంద్ బాష, నారాయణ, రామకృష్ణ, మహేష్ గౌడ్, లక్ష్మి పద్మ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు జిల్లా రంగస్థలానికి విశేష సేవలు అందిస్తున్న ప్రముఖ సీనియర్ రంగస్థల మహిళా కళాకారిణులు రాధిక, అరుణ, శోభారాణి, లక్ష్మి, భారతి, మంజుల తదితర కళాకారిణులను దుశ్వాలువలతో సన్మానించారు.

About Author