సాంకేతిక పరిజ్ఞానంతో.. దేశం అగ్రగామిగా నిలుస్తుంది
1 min readసీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ
- జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని నారాయణ పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం
కర్నూలు, పల్లెవెలుగు: పెరిగిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో 2047 సంవత్సరానికి భారతదేశము అభివృద్ధి చెందిన దేశాల్లో అగ్ర గామి దేశంగా నిలువబోతుందని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. కర్నూల్ నగరంలోని మాధవ నగర్ లో ఉన్న నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటుచేసిన విద్య వైద్యానికి ప్రదర్శనలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శేఖర్ శర్మ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో భారతదేశం శరవేగంగా ముందుకు దూసుకు వెళ్తుందని చెప్పారు. మనిషి జీవితంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక భాగం అయిందని వివరించారు. దీనికి ఆద్యం పోసిన ప్రముఖ శాస్త్రవేత్త సర్ సివి రామన్ జయంతిని జాతీయ సైన్స్ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని వివరించారు. 1928లో సర్ సివి రామన్ రామన్ ఎఫెక్ట్ ను ఆవిష్కరించారని ఇందుకుగాను 1930లో ఆశయాలోనే ఆయనకు తొలిసారిగా నోబెల్ బహుమతి లభించింది అన్నారు. 1928 ఫిబ్రవరి 28న సర్ సివి రామన్ రామన్ ఎఫెక్ట్ను ఆవిష్కరించిన నేపథ్యంలో అదే రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించేందుకు నిర్ణయించి ముందుకు సాగుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విద్యార్థుల్లో సైంటిఫిక్ టెంపర్ ఎంతో అవసరమని చెప్పారు. మనిషి జీవితంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంతో కీలకపాత్ర పోషిస్తుందని వివరించారు. మనం వేసుకునే బట్టలు, తినే ఆహారం, వాడే పుస్తకాలు, సెల్ ఫోన్లు, ట్రాన్స్పోర్ట్, పవర్ జనరేషన్ ఇలా ఒకటి ఏమిటి ప్రతి రంగంలో సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర ఎంతో ముఖ్యమైనదని వివరించారు. విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా పరిశోధనల వైపు దృష్టిసారించి భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదిగి నూతన ఆవిష్కరణలు చేయాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రిన్సిపల్ అల్తాఫ్ తో పాటు పాఠశాల బోధన బోధన సిబ్బంది పాల్గొన్నారు.