PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆరోగ్య ఏపీ లక్ష్యంతో… జగనన్న ఆరోగ్య సురక్ష                 

1 min read

పల్లెవెలుగు వెబ్ తుగ్గలి : మండలం బొందిమడుగుల గ్రామంలో ప్రారంభించడం దేశచరిత్రలో మునుపెన్నడూ జరగని రీతిలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి జగనన్న గొప్ప ఆలోచనలతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది . అని ఇంత గొప్ప కార్యక్రమాన్ని మన రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎవరు చేయడానికి సాహసించలేకపోయారని కానీ మన జగనన్న పట్టుదల ధైర్యం మన నెట్ వర్క్ తో ఇది సాధ్యమవుతుంది అని,ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో వైద్య సిబ్బంది ప్రతి పౌరుడు ఇంటి వద్దనే ప్రముఖ సీనియర్ వైద్యులతో ఉచితంగా ఆరోగ్య పరీక్షలు ఉచితంగా చికిత్స మందులు ఈ కార్యక్రమం ద్వారా అందజేస్తున్నాం అని, నివారించదగిన అనారోగ్య కారణాలతో రాష్ట్రంలోని ఏ కుటుంబం బాధపడకుండా చూడడమే లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించడం గొప్ప విశేషమని  పత్రిక సమావేశం లో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ గారు  తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తుగ్గల మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author