PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రేవంత్ రాక‌తో.. కాంగ్రెస్ లోకి వ‌ల‌స‌లు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు స‌హ‌క‌రిస్తే.. కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుంద‌ని ఢిల్లీ కాంగ్రెస్ నేత‌లు విశ్వసించారు. అందుకు విరుద్దంగా కాంగ్రెస్ రోజురోజుకూ బ‌ల‌హీన‌ప‌డుతూ వ‌చ్చింది. కేసీఆర్ ధాటికి వ‌రుస‌గా కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్ లోకి వ‌ల‌సలు ప్రారంభ‌మ‌య్యాయి. కాంగ్రెస్ భ‌విష్యత్తు ఏంట‌నే ప్రశ్న నేత‌లు, కార్యక‌ర్తల్లో మొద‌లైంది. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా ప్రక‌టించింది. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ క‌నిపించింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి ఇత‌ర పార్టీల నుంచి వ‌ల‌స‌లు కూడ మొద‌ల‌య్యాయి. బీజేపీ ఎంపీ ధ‌ర్మపురి అర్వింద్ సోద‌రుడు, ధ‌ర్మపుర సంజ‌య్ బీజేపీ వీడి కాంగ్రెస్ లో చేరుతున్నట్టు ప్రక‌టించారు. రేవంత్ నాయ‌క‌త్వంలో ప‌నిచేసేందుకు కాంగ్రెస్ లో చేరుతున్నట్టు ఆయ‌న ప్రక‌టించారు. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎర్ర శేఖ‌ర్ బీజేపీ వీడి.. కాంగ్రెస్ లో చేరుతున్నట్టు ప్రక‌టించారు. రేవంత్ రెడ్డితో భేటీ అయిన ఎర్ర శేఖ‌ర్ త్వర‌లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. అలాగే భూపాల‌ప‌ల్లి సీనియ‌ర్ నాయ‌కుడు గండ్ర స‌త్యానారాయ‌ణ కాంగ్రెస్ లో చేరున్నారు. మ‌రోవైపు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. మాజీ ఎంపీ కొండావిశ్వేశ్వర్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇటీవ‌ల కాంగ్రెస్ ను వీడిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లో చేరుతార‌నే ఊహాగానాలు మొద‌ల‌య్యాయి.

About Author