రైతుల సమష్టి కృషితోనే… సాగు చట్టాలు రద్దు : ఎమ్మెల్యే డా. సుధాకర్
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన వ్యవసాయ సాగు చట్టాలను రద్దు చేయడం హర్షించదగ్గ విషయమని, ఇది రైతుల సమిష్ట విజయమన్నారు కోడుమూరు ఎమ్మెల్యే డా. జెరదొడ్డి సుధాకర్. వైసీపీ ప్రభుత్వం ఎప్పుడూ రైతులకు అండగా నిలుస్తుందన్నారు. సాగు చట్టాల రద్దు సందర్భంగా శనివారం వైసీపీ కోడుమూరు ఎమ్మెల్యే డా. జెరదొడ్డి సుధాకర్ నేతృత్వంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు కర్నూలు జిల్లా పరిషత్ నుంచి రాజ్ విహార్ సర్కిల్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. సుధాకర్ మాట్లాడుతూ స్వార్దం కోసం కొందరు చేస్తున్న నిరసనలు నిజానికి రైతు తెలిపే నిరసనలు కావన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో కర్నూలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, డైరెక్టర్లను, నాయకులను, కార్యకర్తలను పాల్గొనేందుకు ఆదేశించారు. రైతులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేదార్ నాథ్, నాయకల్లు ప్రసాద్, ఆది మోహన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, రాజేష్, పర్వేజ్, యునుస్, రమేష్, నవీన్, అరుణ్, జేశ్వంత్, వసంత్, తదితరులు పాల్గొన్నారు.