PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మేఘాల‌కు క‌రెంట్ షాక్ తో.. కృత్రిమ వ‌ర్షం కురిపించారు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : కొన్ని దేశాల్లో అతివృష్టి… మ‌రికొన్ని దేశాల్లో అనావృష్టి. వ‌ర్షం ప‌డితే ఒక బాధ‌.. ప‌డ‌క‌పోతే ఇంకో బాధ‌. దుబాయ్ దేశం వ‌ర్షం లేక విల‌విలాడింది. ఎండ వేడిమికి త‌ట్టుకోలేక‌పోయింది. 50 డిగ్రీల ఉష్ణోగ్రత‌తో దుబాయ్ వాసులు అల్లాడిపోతున్నారు. ఈ ఎండ‌ల‌తో విసిగిపోయిన దుబాయ్ ప్రభుత్వం.. ఓ భారీ ప్రాజెక్ట్ చేప‌ట్టింది. వ‌ర‌ణుడు క‌రుణించ‌క‌పోయినా.. వ‌ర్షాన్ని నేల‌కు తీసుకొచ్చే ప‌నిలో ప‌డింది. ‘ క్లౌడ్ సీడింగ్’ అని పిలిచే వ‌ర్షం త‌యారు చేసే టెక్నాల‌జీని ఉప‌యోగించింది. దీంతో దుబాయ్ లో కొన్ని ప్రాంతాలు త‌డిసిముద్దయ్యాయి. ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురిసింది.
క్లౌడ్ సీడింగ్ అంటే :
క్లౌడ్ సీడింగ్ టెక్నాల‌జీ డ్రోన్ టెక్నాల‌జీ పై ఆధార‌ప‌డి ఉంటుంది. ఆకాశం మేఘావృత‌మైన‌ప్పుడు డ్రోన్లను మేఘాల మ‌ధ్యకు పంపించి..వాటి ద్వార విద్యుత్ షాక్ ఇస్తారు. ఇలా చేయ‌డం ద్వార అవి క‌లిసిపోయి వ‌ర్షం సృష్టించేందుకు ప్రేరేపిస్తాయి. ఇంగ్లండ్ లోని యూనివ‌ర్శిటీ ఆఫ్ రీడింగ్ కి చెందిన మార్టిన్ అంబామ్ ఈ టెక్నాల‌జీ అందించే బృందానికి నేతృత్వం వ‌హించారు. ఈ ప్రాజెక్ట్ కోసం దుబాయ్ సుమారు 15 మిలియ‌న్ డాల‌ర్లు ఖ‌ర్చు చేసింది. వ‌ర్షం ప‌డే స‌మ‌యంలో ఎవ‌రూ బ‌య‌టకు రావొద్దంటూ ప్రభుత్వం ముంద‌స్తు హెచ్చరిక జారీ చేసింది.

About Author