అవినీతి నిర్మూలనతోనే.. రాష్ట్రాభివృద్ధి
1 min read– ఏసీబీ డీఎస్పీ శివనారాయణ స్వామి
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు… ప్రజలు… ప్రతిఒక్కరి సహకారంతో అవినీతి నిర్మూలన సాధ్యమవుతుందని, అప్పుడు రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందన్నారు కర్నూలు ఏసీబీ డీఎస్పీ శివనారాయణ స్వామి. అక్టోబరు 26 నుంచి నవంబరు 1వ తేదీ వరకు జరిగిన జాగురుకత వారోత్సవాల్లో భాగంగా సోమవారం ముగింపు వారోత్సవాన్ని యూనియన్ బ్యాంకు కర్నూలు ప్రాంతీయ కార్యాలయంలో జరిగింది.
బ్యాంకు రీజనల్ మేనేజర్ శ్రీ ప్రశాంత్ దేశాయ్ అధ్యక్షతన జరిగిన జాగురుత ముగింపు వారోత్సవాల కార్యక్రమానికి కర్నూలు ఏసీబీ డీఎస్పీ శివనారాయణ స్వామి, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇంతియాజ్బాష ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అమలు చేయడం.. ప్రజలకు సేవ చేయడం ఉద్యోగులు బాధ్యతగా భావించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ మేనేజర్ శ్రీ వై ఎన్వీఎస్ మూర్తి, చీఫ్ మేనేజర్ వేణుగోపాల్ రావు, ఎస్. మోహన్ రావు, ఏ.శివనంద , సిబ్బంది పాల్గొన్నారు.