PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హిందూ సాంప్రదాయంతో.. విజ్ఞానం పెంపొందుతుంది : సౌదీకర్ గౌరి

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : “మహిళలు ఇంటి ముందు వేసే ముగ్గులు కేవలం ఒక ఆచారం సంప్రదాయం మాత్రమే కాదని, అందులో గొప్ప విజ్ఞానం దాగి ఉందని” రాష్ట్ర విశ్వహిందూ పరిషత్ మాతృ శక్తి కన్వీనర్  శ్రీమతి సౌదీకర్ గౌరీ అన్నారు .2022 జనవరి 7వ తేదీ శుక్రవారం కర్నూల్ శివారులోని విజ్ఞాన పీఠం లో  జరిగిన” ముగ్గుల పోటీలు -బహుమతి ప్రదాన కార్యక్రమం” లో శ్రీమతి గౌరీ ముఖ్య వక్తగా ప్రసంగిస్తూ ప్రతి ఇంటి ముందు ముగ్గులు వేయడం ద్వారా ఇంటిలోనికి బ్యాక్టీరియాలు వైరస్లు రాకుండా అవి నిరోధిస్తాయని, వైద్యపరంగా,వైజ్ఞానికంగా ఈ ముగ్గులు ఇంటిని, ఇంటిలోనివారిని రక్షిస్తుందని,ముగ్గులలో రంగులు నింపడం ద్వారా మనజీవనం లో సుఖం,సంతోషాలు,బాధలు,కష్టాలూ వంటివి ఉన్నాయని మనకు తెలిజేస్తాయని కూడా తెలిపారు.

ముగ్గులను ప్రోత్సహించడం ద్వారా భారతీయ కళలను ప్రోత్సహించడమే అవుతుందని. సభాధ్యక్షులు విజ్ఞాన పీఠం కార్యదర్శి పీ.పీ.గురుమూర్తి  తెలిపారు. ఈ ముగ్గుల పోటీలలో కర్నూలు, బి. తాండ్రపాడు, పసుపల,  సూదిరెడ్డి పల్లె పరిసర గ్రామాల నుండి  మహిళలు, కళాశాల విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు  పాల్గొన్నారు .ఈ కార్యక్రమం విజ్ఞాన సేవా సమితి ,విశ్వహిందూ పరిషత్, విజ్ఞాన పీఠం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ పోటీలలో ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ బహుమతులను విహెచ్పి కర్నూలు జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి జంపాల పార్వతమ్మ  న్యాయనిర్ణేతగా వ్యవహరించి  గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో లో ఎస్ రామిరెడ్డి, ప్రధానోపాధ్యాయులు మాళిగి వ్యాస రాజ్, శ్రీమతి స్వర్ణలత, శ్రీమతి మీనా , చంద్ర మోహన్, సుదర్శనం పాల్గొన్నారు.

About Author