PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సచివాలయ వ్యవస్థతోనే.. రాష్ట్ర అభివృద్ధి

1 min read

– వైసీపీ మండల నాయకుడు ఆర్. బి. చంద్రశేఖర్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్​, గడివేముల: గ్రామ సచివాలయ వ్యవస్థతోనే రాష్ట్రం అభివృద్ధిలో పురోగతి సాధిస్తోందన్నారు వైసీపీ మండల నాయకుడు ఆర్​.బి. చంద్రశేఖర్​ రెడ్డి. సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్ల విశిష్ట సేవల కారణంగా ప్రజా సమస్యలు క్షణాల్లో పరిష్కారం అవుతున్నాయని స్పష్టం చేశారు. కరోన విపత్కర సమయంలో గ్రామ సచివాలయ ఉద్యోగులు,వాలంటీర్ల సేవలు మరువలేమన్నారు. ఆ వ్యవస్థను దేశ ప్రధాని నరేంద్రమోదీ అభినందించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆర్​.బి. చంద్రశేఖర్​ రెడ్డి గుర్తు చేశారు. గ్రామ సచివాలయ వాలంటీర్ల వ్యవస్థ రద్దు కోరుతూ ప్రతిపక్ష టీడీపీ హైకోర్టులో పిటిషన్​ వేసింది. ఇందుకు నిరసనగా వైసీపీ మండల నాయకుడు ఆర్​.బి. చంద్రశేఖర్​ రెడ్డి సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లతో కలిసి గురువారం నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా మండల వైసీపీ నాయకులడు, సహకార సంఘం సొసైటీ చైర్మన్ ఆర్ బీ చంద్ర శేఖర్ రెడ్డి మాట్లాడుతూ సచివాలయం ఏర్పాటు ద్వారా 14 శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని, 523 పౌర సేవలను అందించడం జరుగుతుందని, ఏప్పుడు ఏ సమస్య వచ్చిన అధికారులకి తెలియచేయవచ్చని తెలిపారు. వాస్తవాలు తెలుసుకుని.. టీడీపీ నాయకులు వ్యవహరించాలని, లేదంటే ప్రజలు మరోసారి బుద్ధి చెప్పే సమయం దగ్గర పడుతోందని వైసీపీ మండల నాయకుడు ఆర్​.బి. చంద్రశేఖర్​ రెడ్డి హెచ్చరించారు. కార్యక్రమంలో మండల నాయకులు భూపాల్ రెడ్డి, ఆర్ఐ సంజీవరెడ్డి. ఉప సర్పంచ్ బాల చెన్ని. వంగాలా మహేష్, దేశం నాగేశ్వర్ రెడ్డి, నంద్యాల వెంకటేశ్వర్లు గ్రామ సచివాల సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.

About Author