NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆప్ఘన్ ను తాలిబ‌న్లు ఆక్రమించ‌డంతో.. ధ‌ర‌లు పెరిగే వ‌స్తువులు ఇవే !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబ‌న్లు ఆక్రమించుకోవ‌డంతో వివిధ దేశాల‌తో ఆఫ్గన్ కు ఉన్న సంబంధాలు తెగిపోయాయి. చాలా దేశాల‌తో ఆఫ్గన్ కు వాణిజ్యప‌ర‌మైన సంబంధాలు ఉన్నాయి. భార‌త్ తో కూడ ఆఫ్గన్ కు ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆప్ఘన్ తో భార‌త్ సంబంధాలు తెగిపోవ‌డంతో … ఈ ప్రభావం చాలా వ‌స్తువుల మీద పడుతుంది. ఫ‌లితంగా వాటి ధ‌ర‌లు పెరిగే అవకాశం ఉంది. ఆఫ్గన్ నుంచి భార‌త్ కు దిగుమతి అయ్యే వ‌స్తువుల్లో.. ఎండు ద్రాక్ష, వాల్ న‌ట్స్, బాదం, అంజీర, పైన్ న‌ట్స్, పిస్తా, డ్రై అప్రికాట్, నేరేడు పండు, చెర్రి, పుచ్చకాయతో పాటు మ‌రికొన్ని ఔష‌ధ మూలిక‌లు ఉన్నాయి. వీటి ధ‌ర‌లు పెరిగే అవ‌కాశం ఉంది. భార‌త్ నుంచి ఆప్గనిస్థాన్ కు ఎగుమతి అయ్యే వ‌స్తువుల్లో కాఫీ, టీ, మిరియాలు, ప‌త్తి, బొమ్మలు, పాద‌ర‌క్షలు ఉన్నాయి.

About Author