ఈ ప్రోటీన్ తో బట్టతలపై జుట్టు మొలిపించొచ్చు !
1 min read
పల్లెవెలుగు వెబ్: బట్టతల పై జుట్టు మెలిపించడానికి ఎంతో మంది ఎన్నో విధాల ప్రయత్నం చేస్తుంటారు. అయినా కానీ ఫలితం కనిపించదు. జుట్టు ద్వార వచ్చే అందాన్ని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అలాంటి వారికి ఈ కథనం కొంత ఉపశమనం కలిగిస్తుంది. జుట్టురాలే సమస్యతోపాటు అనేక ఒత్తిడ్లవల్ల శరీరంలో కార్టిజాల్ హార్మోన్ పెరుగుదలకు కారణమౌతుంది. ఫలితంగా తలలోని మాడు భాగానికి, వెంట్రుకల కుదుళ్లకు చెప్పలేని నష్టాన్ని కలిగిస్తుంది. ఆందోళన, కోపం, యాంగ్జైటీ వంటి స్ట్రెస్ సంబంధిత ప్రతిచర్యలు బట్టతలకి కారణమౌతాయని పరిశోధకులు చెబుతున్నదే. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు నేచర్ మ్యాగజైన్‌లో ప్రచురించిన కథనం ప్రకారం ‘GAS6’ అనే ప్రొటీన్ జుట్టు పెరుగుదలను ప్రొత్సహించి, బట్టతలపై వెంట్రుకల పునరుత్పత్తికి సహాయపడుతుందని, బట్టతలకు శాశ్వత పరిష్కారం చూపగలుగుతుందని పేర్కొంది. జుట్టు ఊడిన ప్రదేశంలో కుదుళ్ల నుంచి కొత్త వెంట్రుకలు తిరిగి పెరగడానికి ఈ ప్రోటీన్ సహాయపడుతుందని చెబుతున్నారు.