PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మూడు రాజధానులతోనే.. రాష్ట్రాభివృద్ధి : ఎంపీ డా. సంజీవ్ కుమార్

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: మూడు రాజధానులతోనే ఆంధ్ర ప్రదేశ్​ అభివృద్ధి సాధ్యమన్నారు ఎంపీ డా. సంజీవ్​ కుమార్​. సోమవారం కర్నూలు నగరంలోని మెగా సిరి ఫంక్షన్​ హాల్​లో అధికార వికేంద్రీకరణ పరిరక్షణ సమితి కర్నూలు జిల్లా వారి మూడు రాజధానులు ఏర్పాటు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కర్నూల్ రాజధాని ఉన్న సమయంలో కొంతమంది రాజకీయ లబ్ధి కోసం హైదరాబాద్ కు తరలించారని, ప్రస్తుత సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి కర్నూలును న్యాయరాజధానిగా ప్రకటించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మూడు రాజధానులను వ్యతిరేకించడం సిగ్గుచేటన్నారు.

శ్రీశైలం ప్రాజెక్టుకు 5 వేల ఎకరాలు దానమిచ్చి.. తెలుగు రాష్ట్రాలకు తాగు,సాగునీరు అందిస్తున్న కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటిస్తే… జీర్ణించుకోలేని చంద్రబాబు నాయుడు పేడ్​ ఆర్టిస్టులతో పాదయాత్ర చేయిస్తున్నాడని ఆరోపించారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు మూడు రాజధానుల కు మద్దతు తెలిపి రాయలసీమ రుణం తీర్చుకోకపోతే భవిష్యత్తులో రాయలసీమ ప్రాంతంలో మీరు తిరగలేరని హెచ్చరించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్​ రెడ్డి, డా. సుధాకర్​, మేయర్​ బీవై రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author