NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైసీపీతోనే.. బడుగులకు రాజ్యాధికారం..

1 min read

– సీఎం జగన్‌ సంక్షేమ పాలనకు పరిషత్ ఫలితాలే నిదర్శనం..
– శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి..
పల్లెవెలుగు వెబ్​, నందికొట్కూరు: బడుగు బలహీన వర్గాలకు వైసీపీతోనే రాజ్యాధికారం సాధ్యమన్నారు శాప్​ చైర్మన్​ బై రెడ్డి సిద్ధార్థ రెడ్డి. పరిషత్‌ ఫలితాలతో ప్రభుత్వంపై మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు. 98 శాతానికిపైగా స్థానాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుపొందిందని, భారతదేశ చరిత్రలో ఇదొక రికార్డుగా చెప్పవచ్చని అన్నారు. శుక్రవారం నందికొట్కూరు ఎంపీపీ గా ఎన్నికైన మురళి కృష్ణ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన పబ్బతి జ్యోతి , ఎంపీటీసీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలనకు ఈ ఫలితానే నిదర్శనమన్నారు. సీఎం జగన్‌ పాలనను ప్రజలు విశ్వసించబట్టే ఈ ఫలితాలు వచ్చాయన్నారు. పదవుల్లో అన్నివర్గాల వారికి సమాన ప్రాధాన్యత ఉంటుందని, పార్టీతోపాటు నేతలంతా క్రమశిక్షణగా ఉన్నారన్నారు. టీడీపీ తప్పుడు విమర్శలు, చంద్రబాబు కుట్రలను ప్రజలు నమ్మడం లేదని అన్నారు.

తెలుగుదేశం నాయకులు ఎన్ని అడ్డగోలు ప్రయత్నాలు చేసినా ఫలించలేదని, ఇప్పటికైనా ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారానికే తెలుగుదేశం నాయకులు పరిమితమయ్యారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో లో నందికొట్కూర్ మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి. మార్కెట్ యార్డ్ చైర్మన్ తువ్వా చిన్న మల్లా రెడ్డి, వైసిపి నాయకులు ఉస్మాన్ బెగ్, పబ్బతి రవి, కోటిరెడ్డి, కోళ్లల బాపురం నాగార్జున, వైసిపిి నాయకులు కార్యకర్తలు అభిమానుల తదితరులుుు పాల్గొన్నారు.

About Author