‘జల మిషన్’తో… ఇంటింటికి కుళాయి.. :సర్పంచ్ నాగార్జునాచారి
1 min readపల్లెవెలుగు అన్నమయ్య జిల్లా వీరబల్లి: జల జీవన మిశ్రమాన్ని పథకం ధ్వారా ప్రతిఇంటికీ స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే లక్ష్యమని మట్లి గ్రామ సర్పంచి నాగార్జునాచారి పేర్కొన్నారు. సోమవారం వీరబల్లి మండల పరిధిలోని మట్లి గ్రామ పంచాయతి నందు (JJM) జల జీవన్ మిషన్ పథకం ద్వారా మంజూరైన స్కీం బోర్లను గ్రామస్తులతో కలిసి సర్పంచ్ సోమారపు నగార్జునాచారి ప్రత్యేక పూజలు నిర్వహించి బోర్లను ప్రారంభించారు.గ్రామానికి మొత్తం నాలుగు యల్లంపల్లి, తొగటపల్లి, వడ్డేపల్లి,పెద్దూరు కు మంజూరవ్వగా మొదటగా తొగటపల్లిలో,యల్లంపల్లి లో ప్రారంభించారు..ఈ సందర్బంగా సర్పంచ్ సోమారపు నగార్జునాచారి మాట్లాడుతు గ్రామీణ ప్రాంతాలలో నీటి కొరత లేకుండా ఉండేందుకు ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిందన్నారు.ఈ పథకాన్ని ప్రధాన మంత్రి ఆగస్టు 15, 2019న జల్ జీవన్ మిషన్‌ను ప్రారంభించారన్నారు. మిషన్ ప్రారంభించిన సమయంలో కేవలం 3.23 కోట్ల (17%) గ్రామీణ కుటుంబాలకు మాత్రమే పంపు నీటి సరఫరా ఉండేది. ఆ తర్వాత 100శాతం మేర ఇళ్లకు పంపు కనెక్షన్లు అందజేయడం జరుగుతుందన్నారు.జల జీవన్ మిషన్ ద్వారా మహిళల పడుతున్న ఇబ్బందుల తో పాటు సమయం ఆదా చేయడం జరుగుతుందన్నారు. జల జీవన్ మిషన్ వల్ల గతంలో తాగునీటి కోసం మహిళల సుదూర ప్రాంతాల ప్రయాణం చేయవలసి వచ్చిందని ఇప్పుడు ఆ సమస్యను పరిస్కారం జరుగుతుందన్నారు. జల జీవన్ మిషన్ వల్ల తమ గ్రామాల్లో ప్రతి కుటుంబానికి పరిశుభ్రమైన తాగునీరు లభిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు నాగభూషణం నాయుడు, బండి రమణయ్య ,పుల్లగూర చెన్నకేశవులు ,కనితి వెంకటరమణ ,శ్రీధర్, శ్రీనివాస స్వామి, తదితరులు పాల్గొన్నారు.