PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యోగాతో..ఆరోగ్యం పదిలం: బైరెడ్డి శబరి

1 min read

‘భాష్యం’లో అంతర్జాతీయ యోగా దినోత్సవం

పల్లెవెలుగు: ప్రతిఒక్కరు యోగాసనాలు చేయడం వల్ల ఆరోగ్యం పదిలంగా ఉంటుందన్నారు బీజేపీ సీనియర్​ నాయకురాలు బైరెడ్డి శబరి. బుధవారం నంద్యాల ఎస్బిఐ కాలనీలో ఉన్న భాష్యం స్కూల్ నందు అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలకు బైరెడ్డి శబరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగా యొక్క ప్రాముఖ్యతను మరియు దాని విశిష్టతను యోగా వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరించడం జరిగినది. అలాగే విద్యార్థులు కూడా యోగ ప్రదర్శన చేయడం జరిగింది ఉద్యోగ ఈ యోగా అనేది మన భారతదేశ సంస్కృతి ని జీవన విధానాన్ని ప్రపంచానికి తెలియజేయడమే కాకుండా ప్రపంచ దేశాలు చాలా వరకు వీటిని ఆచరించడానికి మక్కువ చూపడం గర్వంగా భావిస్తున్నామని చెప్పుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి నాగిరెడ్డి బాలచంద్రుడు ఆదినారాయణ యోగ మాస్టర్ నారాయణస్వామి రామచంద్రారెడ్డి అలాగే భాష్యం స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

About Author