(సేఫ్ కస్టడీ ఆర్టికల్స్)ను 19న విత్ డ్రా చేసుకునేలా చర్యలు చేపట్టండి
1 min read: జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కలెక్టరేట్ లోని జిల్లా ట్రెజరీ స్ట్రాంగ్ రూమ్ లో ఉన్న (సేఫ్ కస్టడీ ఆర్టికల్స్) ను 19వ తేదిన విత్ డ్రా చేసుకునేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య సంబంధిత అధికారులను ఆదేశించారు.కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ లో జిల్లా ట్రెజరీ స్ట్రాంగ్ రూమ్‌లలో మూడు సంవత్సరాలకు పైగా భద్రపరిచిన వస్తువులు (సేఫ్ కస్టడీ ఆర్టికల్స్) పై జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ట్రెజరీ స్ట్రాంగ్ రూమ్‌లలో మూడు సంవత్సరాలకు పైగా ఉన్న వాటిని 19వ తేదిన సంబంధిత అధికారులు వచ్చి విత్ డ్రా చేసుకోవాలన్నారు. మూడు సంవత్సరాలలోపు ఉన్న వాటిని కొనసాగించాలంటే కమిటీ నిర్ణయం మేరకు అందుకు సంబంధిత అధికారులు కారణాలు తెలుపుతూ లేఖలు సమర్పించినట్లయితే అందుకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ తెలిపారు. అందుకు తగిన ఉత్తర్వులను కూడా జాయింట్ కలెక్టర్ జారీ చేశారు.సమావేశంలో అదనపు ఎస్పీ ఎన్.నాగరాజు, ట్రెజరీ డిడి రామచంద్ర రావు, డిపిఓ నాగరాజు నాయుడు, ఉపాధి కల్పన అధికారి దీప్తి, డిఈఓ రంగారెడ్డి, ఎస్టిఓ కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.