బ్యాంక్ అకౌంట్ లేకుండానే.. ఇలా ఫిక్స్డ్ డిపాజిట్ చేయవచ్చు !
1 min readపల్లెవెలుగు వెబ్ : బ్యాంక్ అకౌంట్ లేకుండానే ఫిక్స్డ్ డిపాజిట్ చేసే అవకాశాన్ని ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇలాంటి సేవలు అందిస్తున్న ఏకైక సంస్థ తమదే అని ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రకటించింది. అయితే.. ఈ అవకాశం కేవలం గూగుల్ పే ఉపయోగించే వారి కోసమేనని సంస్థ తెలిపింది. ఒక ఏడాది పాటు చేసే ఫిక్స్డ్ డిపాజిట్ పై 6.35 శాతం వరకు వడ్డీ అందుకోవచ్చని వెల్లడించింది. 5 లక్షల వరకు డిపాజిట్ గ్యారంటీ ఉంటుందని తెలిపింది.
- వినియోగదారులు గూగుల్ పే యాప్ లో బిజినెస్ అండ్ బిల్స్ విభాగంలో ఈక్విటాస్ బ్యాంక్ ను ఎంచుకోవాలి.
- డిపాజిట్ చేయాలనుకున్న డబ్బు, కాలపరిమితి, వ్యక్తిగత వివరాలు, కేవైసీ వివరాలు సమర్పించాలి.
- కాలపరిమితి ముగియకముందే డిపాజిట్ రద్దు చేసుకుంటే .. అదే రోజు వినియోగదారునికి చెందిన బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ అవుతుందని ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ కంపెనీ వెల్లడించింది.