మాస్క్ లేకుంటే .. 2వేల జరిమాన
1 min readహైదరాబాద్: దేశ వ్యాప్తంగా కరోన కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల ఎక్కువగా ఉంది. దీంతో ఆయా రాష్ట్రాలు కోవిడ్ నిబంధనలు కఠినతరం చేశాయి. తాజగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆసక్తిని రేపింది. మాస్క్ లేకుంటే.. 2 వేలు ఫైన్ విధించింది. హైదరాబాద్ లోని ఫతేనగర్ లో ఓ షాపు యజమాని మాస్క్ లేని కస్టమర్లను అనుమతించినందుకు.. జీహెచ్ ఎంసీ షాపు యజమానికి 2వేల ఫైన్ విధించింది. కోవిడ్ నియంత్రణలో భాగంగా నియమాలను కఠినతరం చేసింది. బహిరంగ ప్రదేశాలు, జనసంచారం గల ప్రదేశాలలో మాస్క్ తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాస్క్ ధరించని వారి మీద విపత్తు నిర్వహణ చట్టం-2005 లోని 51 నుంచి 60 సెక్షన్లతో పాటు ఐపీసీ 188 సెక్షన్ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇక హోలీ వేడుకులతో పాటు ఏప్రిల్ 30 వరకూ ఏ మతపరమైన వేడుకల్ని బహిరంగ ప్రదేశాల్లో జరుపుకోకూడదని ఆదేశించింది.