మాస్క్ లేకుంటే.. రూ. 500 జరిమానా
1 min read
పల్లెవెలుగువెబ్ : కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో మాస్క్‌ను తప్పనిసరి చేశారు. మాస్క్‌ను ధరించని వారిపై రూ.500 జరిమానా విధించాలని ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ సమావేశంలో నిర్ణయించారు. పాఠశాలలను ఇప్పటికిప్పుడు మూసివేయబోమని డీడీఎంఏ స్పష్టం చేసింది. దేశంలో బుధవారం 2,067 కొత్త కొవిడ్ కేసులు నమోదవగా, 40 మరణాలు సంభవించాయి. కొత్త కేసుల్లో ఎక్కువ భాగం హరియాణా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మిజోరంలలో బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉం డాలంటూ ఆయా రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు.