NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టికెట్ లేకుండా ..శనేశ్వర పూజలు

1 min read

పల్లెవెలుగు, మహానంది: కర్నూలు జిల్లా మహానంది క్షేత్రం లో శనేశ్వర పూజలు టికెట్ లేకుండా గుట్టుచప్పుడు కాకుండా చేస్తున్నట్లు తెలుస్తుంది. మంగళవారం ఉదయం ఒక యువకుడు నవగ్రహ పూజ చేయించుకోవడం చర్చనీయాంశంగా మారింది.  ఉదయం 9 నుండి 9:30 మధ్యన ఈ సంఘటన జరిగినట్లు సమాచారం .ఓ అధికారికి తెలియజేసిన పట్టీపట్టనట్లు వ్యవహరించటం పలు ఆరోపణలకు తావిస్తోంది .పర్యవేక్షించాల్సిన అధికారులు అక్కడున్న పూజా కార్యక్రమాలు నిర్వహించే అర్చకులకు ప్రాధాన్యత ఇవ్వడం ,కళ్ళెదురుగా జరుగుతున్న కళ్ళు మూసుకోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు .దీనిపై విచారిస్తే పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని భక్తులు ఆరోపిస్తున్నారు .ఉన్నతాధికారి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న కొందరు సహకరించకపోవడంతో పాటు తప్పుదోవ నటించాలని చూస్తున్నట్లు సమాచారం .అక్కడ పనిచేస్తున్న సహాయఅర్చకునికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం విశేషం.

About Author