జీఓ లేకుండానే…‘అంగన్వాడీ’ల నియామకం తగదు..
1 min read–కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ ధర్నా
పల్లెవెలుగు, ఏలూరు: ఏలూరు జిల్లా చింతలపూడి అంగన్వాడి సెక్టార్లో ఎర్రగుంటపల్లిలో ఖాళీగా ఉన్న వర్కర్ పోస్టు నియామకంలో జరిగిన అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ ఏఐటీయూసీ అనుబంద అంగన్వాడి వర్కర్స్ మరియు హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం నాడు కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడి వర్కర్స్ మరియు హెల్పర్స్ ఏఐటియుసి నాయకులు కార్యకర్తలు ధర్నా చేయడం జరిగింది. ఎర్ర గుంటపల్లి అంగన్వాడి కేంద్రంలో వర్కర్ పోస్టు ఖాళీ ఏర్పడినది. ఆ పోస్టు ఎస్సీ కి సంబంధించినది. ఎర్రగుంటపల్లి లో అర్హత ఉన్న ఆయాకు ప్రమోషన్ పద్ధతిలో వర్కర్ గా నియమించవలసి ఉంది. అలాకాకుండా ఐసిడిఎస్ పిడి పద్మావతి చింతలపూడి ప్రాజెక్ట్ ఆఫీసర్ మాధవి తప్పుడు పద్ధతుల్లో ఎటువంటి జీవో లేకుండా పతంగుల గూడెం చెందిన మినీ అంగన్వాడి వర్కర్ లక్ష్మీని నియమించడం జరిగిందని అంగన్వాడి వర్కర్స్ మరియు హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా నాయకులు ఏఐటీయూసీ నాయకులు ఆరోపించారు. ఈ విషయంపై ఐసిడిఎస్ పిడి పద్మావతి గారిని గత 20 రోజులుగా ఏఐటియుసి నాయకులు పలు దఫాలు కలిసి ఏ జీవో ఆధారంగా మినీ వర్కర్ ను మెయిన్ వర్కర్ గా ఎర్రగుంటపల్లి అంగన్వాడీ కేంద్రానికి ఏ విధంగా నియమించారని అసోసియే షన్ కార్యదర్శి రాసప్రోలు మరియమ్మ ఏఐటీయూసీ జిల్లా నాయకులు పి. సోమశేఖర్ అడగగా జీవో ఉందని చెప్పిన పీడీ ఇంతవరకు జీవో కాఫీ ఇవ్వలేదని వారు పేర్కొన్నారు. ఎటువంటి జీవో లేకుండా అక్రమ పద్ధతిలో ఎర్రగుంటపల్లి అంగన్వాడి వర్కర్ గా నియమించిన పతంగుల గూడెం మినీ వర్కర్ లక్ష్మిని వర్కర్ పోస్ట్ నుంచి తొలగించి అర్హత ఉన్న ఎర్రగుంటపల్లి వర్కర్ కు ఆ పోస్ట్ నివ్వాలని వారు డిమాండ్ చేశారు. ఏప్రిల్ మాసంలో లక్ష్మికి వర్కర్ పోస్ట్ ఇచ్చినప్పటికీ ఇంతవరకు ఆ పోస్టులో పనిచేయకుండానే వంట బిల్లులు జీతం చెల్లిస్తున్నారని ఇదంతా కూడా చింతలపూడి అంగన్వాడి పిఓ మాధవి తప్పుడు పద్ధతిలో వ్యవహరిస్తుందని వారు ఆరోపించారు. ఇప్పటికైన లేని జీవో నాటకానికి పిడి తెరదించాలని అర్హత ఉన్న ఎర్రగుండపల్లి ఆయాకు వర్కర్ పోస్ట్ ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం నాయకులు జిల్లా కలెక్టర్ ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా నాయకులు, చింతలపూడి నాయకులు గంధం అంజమ్మ, పులపర్తి విజయలక్ష్మి, పరిటాల మల్లేశ్వరి, సికాకోలు భాగ్య లక్ష్మి ,ఏఐటీయూసీ నాయకులు బండి వెంకటేశ్వర రావు, ఏఐటియుసి రెడ్డి శ్రీనివాస్ డాంగే, జిల్లా నాయకులు తొర్లపాటి బాబు డేగా, ప్రభాకర్ పుప్పాల కన్నబాబు, యు. హేమ శంకర్, కే గురవయ్య, ఏ అప్పలరాజు, పోలా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.