రామాయణం లేకపోతే మానవజాతికి ఆదర్శం లేదు
1 min read– డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే, హిం.ధ.ప్ర.ప. కార్యనిర్వాహకులు.
– అత్యంత భక్తిశ్రద్ధలతో ముగిసిన ధార్మిక కార్యక్రమాలు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: శ్రీమద్రామాయణం లేకపోతే మానవజాతికి ఆదర్శమే లేదని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో పాణ్యం మండలం, గోనవరం గ్రామంలోని శ్రీకృష్ణ మందిరం నందు గత ఐదు రోజులుగా జరుగుతున్న ధార్మిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలతో అత్యంత భక్తిశ్రద్ధలతో ముగిశాయి.ఈ సందర్భంగా డాక్టర్ మల్లు వేంకటరెడ్డి మాట్లాడుతూ శ్రీరాముడు సర్వమానవాళికి ఆదర్శప్రాయుడని, ఆయన జీవితం సమస్తమానవాళి ఆచరించదగ్గదని ఉద్బోధించారు. అలాగే గోసంరక్షణ ప్రతివ్యక్తి కర్తవ్యంగా భావించాలని పిలుపునిచ్చారు. కుంకుమార్చన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు. గీతాప్రచారకులు వైష్ణవ రామశేషయ్య ప్రవచనాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో ధర్మాచార్యులు అల్లె శివరామిరెడ్డి, సానె పక్కీరారెడ్డి, అర్చకులు వెంకటశేషయ్య, య. రామసుబ్బయ్య, గడ్డం భాస్కరరెడ్డి, గడ్డం శేషిరెడ్డి, జి. హనుమంతు,యు.భాస్కర్, యు.వెంకటసుబ్బయ్య, భూషిరెడ్డి, వెంకటయ్య, సమరసతా సేవా ఫౌండేషన్ ప్రతినిధి యు.శివరామిరెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.