PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇంట‌ర్నెట్ లేకున్నా.. డిజిట‌ల్ చెల్లింపులు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇంట‌ర్నెట్ లేకున్నా డిజిట‌ల్ చెల్లింపులు చేసేందుకు అనుమ‌తిస్తూ ఆర్బీఐ నిర్ణ‌యించింది. ఒక లావాదేవీకి రూ.200 మించకుండా, లావాదేవీల మొత్తం కలిపి రూ.2,000 వరకు ఈ విధానంలో చెల్లింపులు చేసేందుకు అవకాశం కల్పించింది. గ్రామీణ, చిన్న పట్టణాల్లో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ పథకాన్ని ఆర్‌బీఐ అమల్లోకి తెస్తోంది. కొన్నిసార్లు నెట్‌వర్క్‌ సరిగా లేకపోతే డిజిటల్‌ చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయి. ఒక్కోసారి ఖాతాదారు బ్యాంకు ఖాతాలో నగదు డెబిట్‌ అయినా.. వ్యాపారికి చేరడం లేదు. ఈ సమస్యకు పరిష్కారంగా అసలు ఇంటర్నెట్‌ లేకున్నా.. ఆఫ్‌లైన్‌ ద్వారానే డిజిటల్‌ చెల్లింపులు జరిపే పద్ధతిని ఆర్‌బీఐ ఆవిష్కరించింది. ఈ ఆఫ్‌లైన్‌ లావాదేవీలను కార్డులు, వాలెట్లు, మొబైల్‌లు తదితరాలతో చేసేందుకు వీలుంది. ఈ లావాదేవీల్లో ఏర్పడే వివాదాలూ అంబుడ్స్‌మన్‌ పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది.

                                    

About Author