మహిళ పక్షపాతి.. సీఎం జగన్
1 min read– మాజీ ఎంపీ బుట్టా రేణుక
పల్లెవెలుగు, కర్నూలు
మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే… కుటుంబం ఆర్థికంగా బలపడుతుందని మాజీ ఎంపీ బుట్టారేణుక అన్నారు. మహిళల అభ్యన్నతిని దృష్టిలో ఉంచుకుని.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు రూపొందించారన్నారు. సోమవారం నగరంలోని 18వ వార్డు జొహరాపురం వైసీపీ అభ్యర్థి పుల్లమ్మ (పల్లవి) గెలిపించాలని కోరుతూ.. ఇంటింట ప్రచారం నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవమున సీఎం జగనన్న.. మహిళలకు పెద్దపీఠ వేశారన్నారు. జిల్లాలో వైసీపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో అభ్యర్థి పల్లవి, వార్డు ఇంచార్జీ విజయ లక్ష్మి, ఇతర నాయకులు పాల్గొన్నారు.