PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పిడుగుపడి.. మహిళ మృతి
– ఐదేళ్ల క్రితం గుండెపోటుతో భర్త మృతి
– అనాథలైన చిన్నారులు
పల్లెవెలుగు వెబ్​, నందికొట్కూరు: కూలీనాలీ చేసుకుని జీవనం సాగించే .. ఆ కుటుంబంపై విధి పగబట్టింది. ఐదేళ్ల క్రితం గుండె పోటుతో తండ్రి మృతి చెందాడు. కుటుంబ యజమానిని కోల్పోయినా.. ఇద్దరు చిన్నారులను కాయకష్టం చేసి పెంచి పోషిస్తున్న ఆమెపై పిడుగు రూపంలో మృత్యు ఒడిలోకి చేరింది. దీంతో ఆ ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. గ్రామస్తుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. నాగటూరు గ్రామానికి చెందిన శాంత కుమారి కి అదే గ్రామానికి చెందిన వెంకట స్వామితో 10 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం . సందేశ్ 4 తరగతి, సౌమ్య 2 తరగతి చదువుతున్నారు. ఎంతో సంతోషంగా జీవిస్తున్న తరుణంలో 5 ఏళ్ళ క్రితం కుటుంబ పెద్ద వెంకట స్వామి గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయినప్పటికి కూలి పనులు చేస్తూ ఇద్దరు పిల్లలను చదివిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. ఎప్పటిలాగే శుక్రవారం బోల్లవరం గ్రామానికి వ్యవసాయ కూలి పనులకు వెళ్ళింది. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో పిడుగు పాటుకు గురై శాంతకుమారి అక్కడికక్కడే మృతిచెందింది. తల్లిదండ్రులు ఇద్దరు మృతి చెందడంతో పిల్లలు అనాధలుగా మిగిలారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చిన్నారులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.


About Author