మహిళలు బహుముఖ ప్రజ్ఞావంతులు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: మహిళలు బహుముఖ ప్రజ్ఞావంతులు అని అందుకే అన్ని రంగాల్లో రాణిస్తున్నారని కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి నవ్య అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని సునయన ఆడిటోరియం నందు ఏపీ జెఎసి అమరావతి, మానవతా మహిళా విభాగం, ఏపీ రెవెన్యూ అసోసియేషన్, ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ లు నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఒత్తిడికి దూరంగా ఉండాలని తమ పిల్లలను కూడా ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవాలని ప్రతి పిల్లవాడిలో ఒక ప్రత్యేకత ఉంటుందని దాన్ని ప్రోత్సహించాలన్నారు. ఒక వైపు గృహం మరొకవైపు ఉద్యోగం మరొకవైపు పిల్లల కెరీర్ ఇలా అన్నీ తానై చేస్తున్నాడంవల్ల ఒత్తిడి ఉంటుందని అందుకే అన్నిటిని ధైర్యంగా ముందుకు నడపాలని అన్నారు. తల్లిదండ్రులు తమ ఇంటి పనుల్లో మగ పిల్లలు ఆడపిల్లలు అని తేడా చూపకుండా ఇద్దరికీ అన్ని పనులు సమానంగా నేర్పాలని అప్పుడే వారిలో ఇద్దరు సమానం అనే భావన నెలకుంటుందన్నారు. డిఆర్ఓ వెంకట నారాయణమ్మ మాట్లాడుతూ మహిళా ఉద్యోగులు తమ సమస్యలను నేరుగా తమ దృష్టికి తేవాలని చెప్పలేని పరిస్థితులు ఉంటే నూతనంగా ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ లో సమస్యలను తెలియపరచాలని కోరారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రసన్న లక్ష్మీ మాట్లాడుతూ సృష్టిలో ఆడ మగ తేడా లేదని అందరూ సమానమే అని సమాజంలో మనం సృష్టించుకున్నవే ఈ తేడాలని ఇది సరైంది కాదన్నారు. డిప్యూటీ కలెక్టర్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ కుమారి సింధు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ చేసే పనికి స్రీలు, పురుషులు తేడా లేదని మనుషుల మెదడులోనే ఇది ఉందని సమాజం మారుతుందని మనుషులు కూడా అందుకు అనుగుణంగా మారాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉద్యోగులు మంచి నృత్య రూపాలతో హోరెత్తించారు. ఏ.పీ జే. ఏ. సి మహిళా విభాగం చైర్మన్ సెహారా బాను, మానవతా మహిళా విభాగం కన్వీనర్ యాని ప్రతాప్, ఏ.పి రెవెన్యూ ఆసోషియేషన్ వైస్ ప్రెసిడెంట్ శివపార్వతి, వుమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సరస్వతమ్మ వీరి ఆషోయేషన్ సభ్యులు జాయింట్ కలెక్టర్ ని పిఆర్ఓని స్పెషల్ కలెక్టర్ ని హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ని సన్మానించడం జరిగింది. అదేవిధంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న డాక్టర్ మాధవి శ్యామల, ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ షమీన, వివిధ శాఖల మహిళా అధికారులకు సన్మానం నిర్వహించారు. కార్యక్రమం మధ్యలో విద్యుత్ అంతరాయం జరగటంతో మహిళలందరూ తమ సెల్ ఫోన్ లైట్ల ప్రదర్శనతో మహిళా సమస్యలపై పోరాటం ధైర్యంగా ఎదుర్కొంటామంటూ నినాదాలు ఇచ్చారు అనంతరం గురువారం నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతి ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్తలు ప్రసంగించిన అనేక విషయాలు మహిళలను ఎంతో ఆలోచింప చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ సబిహ పర్వీన్, తాసిల్దార్ నాగమణి, ఏపీ జెఎసి నాయకులు, జ్ఞానేశ్వరమ్మ మానవతా మహిళా విభాగం అధ్యక్షురాలు దీప, సెక్రటరీ అపర్ణ, పద్మ, పోలీస్ లక్ష్మి, చంద్రకళ, మంజుల, సరోజ, లీల, భారతి, ఉషారాణి, వనజాక్షి తదితరులు పాల్గొన్నారు.
